Vaibhav Sooryavanshi : నిరాశపర్చిన వైభవ్ సూర్యవంశీ.. మాజీ ఆల్‌రౌండర్ అశ్విన్ కీలక కామెంట్స్.. అలా సెట్ కాదు..
Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ఆర్డర్‌పై రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మూడో స్థానంలో ఆడటం వైభవ్‌కు సరిపోదని, సంజూ శాంసన్‌కు ఆ స్థానాన్ని కేటాయించాలని టీమ్ మేనేజ్మెంట్కు సూచించాడు.
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం రెండో టీ20 మ్యాచ్ జరిగింది. అయితే, ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కింది. ఇషాన్ కిషన్ గాయపడడంతో అతని స్థానంలో వైభవ్‌ను తీసుకున్నారు.
వైభవ్ సూర్యవంశీ జట్టులో ఉంటే ఎక్కువశాతం ఓపెనర్‌గా క్రీజులో వస్తాడు. అయితే, ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో ఓపెనర్లుగా సంజు శాంసన్, అభిషేక్ శర్మలు క్రీజులోకి వచ్చారు. దీంతో రెండో మ్యాచ్‌లోనూ వారిద్దరే ఓపెనర్లుగా క్రీజులోకి రావడంతో వైభవ్ సూర్యవంశీ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. కివీస్ బౌలర్లపై వైభవ్ విరుచుకుపడటం ఖాయమని క్రికెట్ ఫ్యాన్స్ భావించారు. కానీ, క్రీజులోకి అడుగుపెట్టిన కొద్దిసేపటికే వైభవ్ పెలియన్ బాటపట్టాడు. కేవలం నాలుగు పరుగులతో నిరాశపర్చాడు. తన శైలికి భిన్నంగా ఓపికగా ఆడుతూ 8 బంతులు ఎదుర్కొన్న అతడు.. స్మిత్ బౌలింగ్‌లో మిచెల్‌కు తేలికైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం అతడి సహజమైన ఆటతీరుకు సరిపోలేదని అభిప్రాయపడ్డాడు. సంజు, అభిషేక్, వైభవ్ ముగ్గురు ఆటగాళ్లను ఒకేసారి ఆడించాలనుకుంటే బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాల్సి ఉంటుందని టీమ్ మేనేజ్మెంట్కు సూచించాడు.
వైభవ్‌ను అలవాటులేని స్థానంలో క్రీజులోకి పంపించడంతో అతడు ఇబ్బంది పడ్డాడు. నీటి నుంచి బయటపడిన చేపలా అతడి పరిస్థితి మారింది. భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. టైమింగ్ విషయంలో ఇబ్బంది పడుతున్న వేళ.. అతడికి సీనియర్ అండ ఉండటం చాలా కీలకం. ఆరో ఓవర్లో బ్యాటింగ్‌కు దిగడం అతడికి ఏమాత్రం సరిపోదు. అభిషేక్, సంజు, వైభవ్ జట్టులో ఉంటే.. సంజు మూడో నంబర్లో బ్యాటింగ్‌కు రావాలి. వైభవ్‌ను వన్‌డౌన్‌లో ఆడేందుకు జట్టులోకి తెచ్చారని నేను అనుకోను అని అశ్విన్ పేర్కొన్నాడు.
