Airtel vs Jio : యూట్యూబ్‌లో యాడ్స్‌కు గుడ్‌బై.. ఎయిర్టెల్, జియో యూజర్లకు బంపర్ ఆఫర్!
Airtel vs Jio : ఎయిర్టెల్, జియో రూ.200 డేటా వోచర్లతో యూట్యూబ్ ప్రీమియం, 30GB డేటా, ఓటీటీ బెనిఫిట్స్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఆఫర్ల పూర్తి వివరాలివే..
Airtel vs Jio
- రూ.200 రీఛార్జ్‌తో యూట్యూబ్ ప్రీమియం.. ఎయిర్టెల్, జియో ఆఫర్లు
- 30GB డేటా, ఓటీటీ బెనిఫిట్స్ ఏ ప్లాన్ బెస్ట్?
- 28 రోజుల వ్యాలిడిటీ, రూ.150 డిస్కౌంట్ బెనిఫిట్
Airtel vs Jio : యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుంటారా? మధ్యలో వచ్చే యాడ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా? యూట్యూబ్ ప్రీమియం కోసం ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు చేయాల్సిన పనిలేదు.. ఇకపై యాడ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ పొందవచ్చు..
అది ఎలాగంటే.. ఎయిర్టెల్, జియో యూజర్ల కోసం ఈ అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన ప్రీపెయిడ్ యూజర్లకు ఈ రెండు టెలికాం కంపెనీలు రూ.200 డేటా వోచర్‌తో యూట్యూబ్ ప్రీమియం బెనిఫిట్స్ అందిస్తున్నాయి. అవేంటో ఓసారి వివరంగా చూద్దాం..
రూ.200తో యూట్యూబ్ ప్రీమియం.. ఎయిర్టెల్ ఆఫర్ :
ఎయిర్టెల్ అందిస్తున్న రూ.200 డేటా వోచర్లో 30GB హైస్పీడ్ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ ఉన్నాయి. యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందొచ్చు. అంతేకాదు, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5, సోనీలివ్ సహా 18కి పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. దీంతో వీడియోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లను చూసేవారికి బెస్ట్ ఆప్షన్..
జియో యూజర్లకూ ఫుల్ బెనిఫిట్స్ :
జియో కూడా రూ.200 డేటా వోచర్‌పై యూట్యూబ్ ప్రీమియం బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ వోచర్ ద్వారా 30GB హైస్పీడ్ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో పాటు జియో టీవీ మొబైల్ యాప్ ద్వారా పలు ఓటీటీ సేవలను పొందవచ్చు.
Read Also : AP Cyclone Alert : తుఫాను ముప్పు వేళ అప్రమత్తతే రక్షణ.. ఏపీ ప్రజలు ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి!
ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, సోనీలివ్, జీ5, సన్‌ఎన్‌ఎక్స్‌టీ, లయన్‌గేట్ ప్లే, డిస్కవరీ+, ఈటీవీ విన్ వంటి ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. అదనంగా సినీపోలిస్ టికెట్లపై రూ.150 డిస్కౌంట్ బెనిఫిట్ కూడా పొందవచ్చు.
రీఛార్జ్ చేసే ముందు చెక్ చేయండి :
ఈ ఆఫర్లను పొందాలంటే యూజర్లకు యాక్టివ్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఉండాలి. జియో అర్హత ఉంటే రోజువారీ 1GB లేదా 1.5GB డేటా ప్లాన్లపై అన్లిమిటెడ్ 5G డేటా బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. అయితే ఈ బెనిఫిట్స్ వర్తించే నిబంధనలు, అర్హతలు వేర్వేరుగా ఉండొచ్చు..
యూట్యూబ్‌లో యాడ్స్ లేకుండా వీడియోలు చూడటం, అదనపు డేటా, ఓటీటీ బెనిఫిట్స్ కోరుకునేవారికి ఈ ఆఫర్లు అద్భుతంగా ఉంటాయి. రీఛార్జ్ చేసుకునే ముందు అధికారిక యాప్‌లో ప్రస్తుత ఆఫర్ వివరాలు, సబ్స్క్రిప్షన్ వ్యవధిని ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్..
