Kangana Ranaut : ఎంపీగా గెలిస్తే సినిమాలు మానేస్తాను.. బాలీవుడ్ క్వీన్ సంచలన ప్రకటన..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Kangana Ranaut : ఎంపీగా గెలిస్తే సినిమాలు మానేస్తాను.. బాలీవుడ్ క్వీన్ సంచలన ప్రకటన..

Kangana Ranaut gives a sensational statement in Election Promotions regarding her Movies

Updated On : May 20, 2024 / 7:28 AM IST

Kangana Ranaut : బాలీవుడ్(Bollywood) క్వీన్ కంగనా రనౌత్ గతంలో ఎన్నో సినిమాలతో భారీ విజయాలు సాధించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ ఇటీవల ఫలితాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళ్తుంది. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. త్వరలో ఎమర్జెన్సీ సినిమాతో రాబోతుంది. ఇక బాలీవుడ్, దేశం సమస్యలు గురించి మాట్లాడుతూ ఫైర్ బ్రాండ్ గా మారింది. అయితే ప్రస్తుతం బీజేపీ తరపున ఎంపీగా ఎన్నికల్లో పోటీ చేస్తుంది.

కంగనా తన సొంత నియోజకవర్గం, పుట్టి పెరిగిన ఊరు హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి ఎంపీగా పోటీ చేస్తుంది. గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Also Read : Payal Rajput : టాలీవుడ్‌లో బ్యాన్ చేస్తామని భయపెడుతున్నారు.. పాయల్ రాజ్‌పుత్ సంచలన పోస్ట్..

కంగనా మాట్లాడుతూ.. సినిమా ప్రపంచం అంతా అబద్ధం. అక్కడ అందరూ నకిలీనే. అదొక భిన్నమైన వాతావరణం. ప్రేక్షకులను ఆకర్షించే ఓ నీటి బుడగ సినిమా. నేను ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రపంచం వాస్తవం. ఈ వాస్తవంలోనే బతకాలనుకుంటున్నాను. ఈ ఎన్నికల్లో నేను ఎంపీగా గెలిస్తే పూర్తిగా సినిమాలు మానేసి రాజకీయాలకు అంకితమవుతాను. చేతిలో ఉన్న సినిమాలు మాత్రం పూర్తిచేస్తాను అని తెలిపింది.

దీంతో కంగనా వ్యాఖ్యలు వైరల్ అవ్వగా అభిమానులు సినిమాలు మానేయొద్దు, సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో ఉండండి, అలా చాలా మంది నటీనటులు రాజకీయాల్లో ఉన్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలో కూడా చాలా మంది స్టార్స్ రాజకీయాల్లోకి వస్తే సినిమాలు మానేస్తామన్నారు కానీ రెండిట్లోనూ రాణించారు, ఇప్పుడు కూడా రాణిస్తున్నారు చాలామంది స్టార్స్. మరి కంగనా నిజంగానే ఎంపీగా గెలిస్తే సినిమాలను వదిలేస్తుందా లేదా చూడాలి.