Payal Rajput : టాలీవుడ్‌లో బ్యాన్ చేస్తామని భయపెడుతున్నారు.. పాయల్ రాజ్‌పుత్ సంచలన పోస్ట్..

తాజాగా పాయల్ రాజ్‌పుత్ రక్షణ సినిమాని ఉద్దేశిస్తూ తన సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేసింది.

Payal Rajput : టాలీవుడ్‌లో బ్యాన్ చేస్తామని భయపెడుతున్నారు.. పాయల్ రాజ్‌పుత్ సంచలన పోస్ట్..

Payal Rajput Sensational Post about her Rakshana Movie Team

Updated On : May 20, 2024 / 7:10 AM IST

Payal Rajput : RX100 సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమని, ప్రేక్షకులని తనవైపుకు తిప్పుకుంది పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత పలు కమర్షియల్ సినిమాలు చేసినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇటీవల మంగళవారం సినిమాతో వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆల్మోస్ట్ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా మంగళవారం. ఈ సినిమా భారీ హిట్ అవ్వడమే కాక పలు అవార్డులు కూడా గెలుచుకుంది. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ నటన చూసి అంతా ఆశ్చర్యపోయి అభినందించారు.

ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్ వరుస సినిమాలతో బిజీగానే ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల పాయల్ రాజ్‌పుత్ నుంచి రక్షణ అనే సినిమా రాబోతుందని, అందులో పాయల్ పోలీసాఫీసర్ గా నటించబోతుందని ప్రకటించి పోస్టర్స్ కూడా రిలీజ్ చేసారు. తాజాగా పాయల్ రాజ్‌పుత్ ఈ రక్షణ సినిమాని ఉద్దేశిస్తూ తన సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేసింది.

Also Read : Devara Song : ‘దేవర’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. వామ్మో ఓ రేంజ్‌లో ఉందిగా..

పాయల్ రాజ్‌పుత్ తన పోస్ట్ లో.. రక్షణ అని ఒక సినిమా ఉంది. అది 2019 – 2020 మధ్యలో షూట్ చేసాము. దాని ఒరిజినల్ టైటిల్ 5WS. రిలీజ్ కొంచెం లేట్ అయింది. ఇప్పుడు వాళ్ళు నాకున్న పాపులారిటీని, రీసెంట్ గా వచ్చిన సక్సెస్ ని చూసి రిలీజ్ చేసి బెనిఫిట్ పొందాలనుకుంటున్నారు. నాకు వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా ఇవ్వలేదు, అంతే కాకుండా ప్రమోషన్స్ కి రమ్మని అడుగుతున్నారు. నా టీమ్ వాళ్ళతో మాట్లాడారు. కానీ వాళ్ళు నన్ను టాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తామని భయపెడుతున్నారు. నా టీం రక్షణ సినిమా డిజిటల్ ప్రమోషన్స్ కి వస్తాము, నాకు ఇవ్వాల్సిన బాకీ క్లియర్ చేస్తే అని చెప్పినా కూడా వినట్లేదు. నా పేరుని డ్యామేజ్ చేసే విధంగా వాడుతున్నారు. ఇటీవల జరిగిన మీటింగ్స్ లో అసభ్య పదజాలం వాడారు. నాకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వకుండా సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నందుకు నేను ఇప్పుడు లీగల్ గా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను అని పోస్ట్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal)

దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. టాలీవుడ్ లో పాయల్ పోస్ట్ చర్చగా మారింది. మరి పాయల్ ని భయపెట్టిన ఆ నిర్మాతలు ఎవరో, వాళ్ళు దీనికి ఎలాంటి సమాధానమిస్తారో చూడాలి. ఇక పలువురు అభిమానులు, నెటిజన్లు పాయల్ కి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

 

Payl Rajput