Devara Song : ‘దేవర’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. వామ్మో ఓ రేంజ్‌లో ఉందిగా..

తాజాగా దేవర సినిమా ఫస్ట్ సాంగ్ ఫియర్ సాంగ్ రిలీజ్ చేశారు.

Devara Song : ‘దేవర’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. వామ్మో ఓ రేంజ్‌లో ఉందిగా..

NTR Janhvi Kapoor Devara Movie First Song Released

Updated On : May 19, 2024 / 4:55 PM IST

Devara Song : ఎన్టీఆర్(NTR) దేవర సినిమా కోసం అభిమానులు అంతా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ దేవర, వార్ 2 సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. రేపు మే 20 ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉండటంతో అభిమానుల కోసం ఒక రోజు ముందే దేవర సినిమా నుంచి సాంగ్ రిలీజ్ చేస్తామని ఇటీవల ప్రకటించారు మూవీ యూనిట్. ఆల్రెడీ ఆ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసి హైప్ ఇచ్చారు.

Also Read : Pushpa Dance : మంచు కొండల్లో పుష్ప స్టెప్ వేస్తున్న సీనియర్ హీరోయిన్.. వీడియో వైరల్..

తాజాగా దేవర సినిమా ఫస్ట్ సాంగ్ ఫియర్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటని తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగులో ఈ పాట లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి రాయగా అనిరుద్ సంగీత దర్శకత్వంలో అనిరుద్ స్వయంగా పాడాడు. పాటకి అనిరుద్ మ్యూజిక్ కూడా అదిరిపోయేలా ఇచ్చాడు. మీరు కూడా దేవర ఫస్ట్ సాంగ్ వినేయండి..

ఇక దేవర సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా పార్ట్ 1 దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు మూవీ యూనిట్. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు.