Pushpa Dance : మంచు కొండల్లో పుష్ప స్టెప్ వేస్తున్న సీనియర్ హీరోయిన్.. వీడియో వైరల్..
తాజాగా సీనియర్ నటి మీనా పుష్ప స్టెప్ వేసి రీల్ చేసింది.

Pushpa Dance Step by Senior Actress Meena in Iceland Video goes Viral
Pushpa Dance : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమా పాటలు, డైలాగ్స్, మేనరిజం.. అన్ని ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తగ్గేదెలే అంటూ, పుష్ప స్టెప్పులతో వేరే దేశాల్లో కూడా రీల్స్ రూపంలో పుష్ప బాగా పాపులర్ అయింది. ఇక ఇప్పటికే పుష్ప 2 నుంచి గ్లింప్స్, ఓ సాంగ్ రిలీజ్ చేయగా సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
పుష్ప 2 సినిమా నుంచి ఇటీవల రిలీజ్ చేసిన పుష్ప పుష్ప.. అంటూ సాగే సాంగ్ తో పాటు అందులో చెప్పు వదిలేసి కాలు మీద కాలు వేసుకొని చేసే స్టెప్పు బాగా వైరల్ అయింది. చాలామంది ఈ స్టెప్ ని సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా స్టార్లు, సెలబ్రిటీలు కూడా అయి స్టెప్ రీల్ చేశారు.
Also Read : Vijay – Anand : విజయ్ దేవరకొండతో మల్టీస్టారర్ పై ఆనంద్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్.. ఆల్రెడీ చేశారంట..
తాజాగా సీనియర్ నటి మీనా యూరప్ లోని ఐస్ ల్యాండ్ కి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ మంచులో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది మీనా. ఐస్ ల్యాండ్ మంచులో మీనా పుష్ప సాంగ్ స్టెప్ వేసి రీల్ చేసి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ డ్యాన్స్ వీడియో షేర్ చేయడమే కాక మంచు, నిప్పు అదిరిపోయే కాంబినేషన్ అని పోస్ట్ చేసింది. మంచులో ఉండి, పుష్ప ఫైర్ అనే డైలాగ్ తో కంపేర్ చేస్తూ మీనా ఇలా పోస్ట్ చేసింది. దీంతో మీనా పుష్ప స్టెప్ వేసిన వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా చూసేయండి మీనా వేసిన పుష్ప స్టెప్..