Vijay – Anand : విజయ్ దేవరకొండతో మల్టీస్టారర్ పై ఆనంద్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్.. ఆల్రెడీ చేశారంట..

ఆనంద్ దేవరకొండ తన అన్న విజయ్ దేవరకొండ తో కలిసి మల్టీస్టారర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Vijay – Anand : విజయ్ దేవరకొండతో మల్టీస్టారర్ పై ఆనంద్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్.. ఆల్రెడీ చేశారంట..

Anand Deverakonda Interesting Comments about Multi Starrer with Vijay Deverakonda

Updated On : May 19, 2024 / 1:04 PM IST

Vijay – Anand : అర్జున్ రెడ్డితో టాలీవుడ్ లో స్టార్ హీరో అయిన విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో వస్తూనే ఉన్నాడు. ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో మెప్పించిన విజయ్ ఆ తర్వాత మూడు భారీ పాన్ ఇండియా సినిమాలను ప్రకటించాడు. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఆసక్తికర కథలతో మూడు సినిమాలు రాబోతున్నాయి విజయ్ నుంచి. అనౌన్స్ లతోనే సినిమాలపై అంచనాలు పెంచాడు విజయ్.

ఇక విజయ్ తమ్ముడిగా దొరసాని సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ. మొదటి సినిమా నుంచి కొత్త కొత్త కథలతో ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు. ఇటీవల బేబీ సినిమాతో హిట్ కొట్టిన ఆనంద్ త్వరలో మే 31న ‘గం..గం..గణేశా’ సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆనంద్ దేవరకొండ తన అన్న విజయ్ దేవరకొండ తో కలిసి మల్టీస్టారర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Also Read : Anand Deverakonda : బాబోయ్.. సిక్స్ ప్యాక్ చేసిన ఆనంద్ దేవరకొండ.. బాడీ అదిరిందిగా..

అభిమానులు, పలువురు సినిమా లవర్స్ ఈ అన్నదమ్ములతో ఓ మల్టీస్టారర్ పడితే బాగుండు అని గతంలో కూడా కామెంట్స్ చేసారు. తాజాగా ఆనంద్ దేవరకొండ దీని గురించి మాట్లాడుతూ.. దాని గురించి ఎప్పుడూ డిస్కషన్ రాలేదు. చేస్తే బాగానే ఉంటుంది కానీ సెట్ లో మా అన్నని చూస్తే నేను యాక్ట్ చేయడానికి కొంచెం షేక్ అవుతాను. గతంలో చెక్ మెట్ అనే ఓ నాటకం థియేటర్ ఆర్టిస్టులుగా చేశాము. అందులో అన్న హీరోగా డిటెక్టివ్ పాత్ర, నేను విలన్ పాత్ర చేశాను. సినిమాల్లో మల్టీస్టారర్ అంటే ఎప్పుడు జరుగుద్దో తెలీదు కానీ జరిగితే మంచిదే అని అన్నారు.

Also Read : Lady Anchors : సుమతో సహా అయిదుగురు మహిళా యాంకర్లు ఒకే స్టేజిపై.. సందడే సందడి..

దీంతో ఆనంద్ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా ఈ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి చేసిన ఆ చెక్ మెట్ నాటకం వీడియో దొరికితే బాగుండు అని అభిమానులు భావిస్తున్నారు. ఇక వీరిద్దరి కాంబోలో మల్టీస్టారర్ రావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.