యూపీలో ఒకేవ్యక్తి ఎనిమిది ఓట్లు వేసిన ఘటన.. వీడియో వైరల్.. అరెస్టు చేసిన పోలీసులు

ఒకే వ్యక్తి ఎనిమిది ఓట్లు వేసిన ఘటన అనంతరం ఓటర్ల గుర్తింపుకు సంబంధించి విధివిధానాలను కఠినంగా అనుసరించాలని యూపీలో ఎన్నికలు జరగాల్సిఉన్న జిల్లాల ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

UP Man Arrested : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యక్తికి ఎనిమిది ఓట్లు ఘటనపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఎటా జిల్లాలోని నయాగావ్ పోలీస్ స్టేషన్‌లో సదరు వ్యక్తిపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఈసీ వెల్లడించింది. వీడియోలో అనేక సార్లు ఓటు వేస్తున్నట్లు కనిపించిన వ్యక్తి ఖిరియా పమరన్ గ్రామకు చెందిన రాజన్ సింగ్ అనే వ్యక్తిగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారని ఈసీ తెలిపింది. పోలింగ్ విధుల్లో ఉన్న వారందరిపై సస్పెండ్, క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. ఈ ఘటన తరువాత సంబంధిత పోలింగ్ స్టేషన్ పరిధిలో రీ పోల్ కు కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది.

Also Read : Lok Sabha Election 2024 : ఐదో విడత లోక్‌స‌భ‌ ఎన్నికల పోలింగ్ షురూ.. ఆ రెండు స్థానాలపై అందరి దృష్టి

యూపీలోని ఫరూఖాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ లోకి ఓటు వేసేందుకు వెళ్లిన యువకుడు.. ఎనిమిది సార్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)లో బీజేపీకి అభ్యర్థికి ఓటు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తీశాడు. రెండు నిమిషాల నిడివి కలిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎన్నికల సంఘం స్పందించింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకొని సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

Also Read : UK PM Rishi Sunak : కింగ్ చార్లెస్ కన్నా సంపాదనలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ రికార్డు

ఒకే వ్యక్తి ఎనిమిది ఓట్లు వేసిన ఘటన అనంతరం ఓటర్ల గుర్తింపుకు సంబంధించి విధివిధానాలను కఠినంగా అనుసరించాలని యూపీలో ఎన్నికలు జరగాల్సిఉన్న జిల్లాల ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎనిమిది ఓట్ల ఘటనపై తాము తీసుకున్న చర్యలను ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి నవదీప్ రిన్వా వెల్లడించారు. మరోవైపు ఎనిమిది ఓట్ల ఘటనపై చర్యలు తీసుకోవాలని ఈసీని సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేశాయి. ఒకే కుర్రాడు ఎనిమిది ఓట్లు వేస్తున్నాడు, అన్ని ఓట్లు బీజేపీకి పడ్డాయి. ఒక వ్యక్తి ఒక ఓటు మాత్రమే వేయగలడు. కానీ ఆ వ్యక్తి ఎలా ఎనిమిది ఓట్లు వేశాడని ఈసీని సమాజ్ వాదిపార్టీ ప్రశ్నించింది. ఇది కేవలం వీడియో ద్వారా వెలుగులోకి ఘటన మాత్రమే. వెలుగులోకిరాని ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్నవి పారదర్శకమైన ఎన్నికలా? అంటూ ఈసీని సమాజ్ వాదిపార్టీ ప్రశ్నించింది. ఎలక్షన్ కమిషన్ బీజేపీకోసం పనిచేస్తోంది. బాహాటంగా బీజేపీకి అనుకూలంగా దౌర్జన్యానికి పాల్పడుతోంది. ఎనిమిది ఓట్ల తరహా ఘటనలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవలని సమాజ్ వాదిపార్టీ డిమాండ్ చేసింది.

 

ట్రెండింగ్ వార్తలు