NTR : ఎన్టీఆర్ పుట్టిన రోజు స్పెషల్.. ఎన్టీఆర్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..

NTR Interesting Facts about his Life and Movies Happy Birthday NTR

Jr NTR : ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా యాక్టర్. RRRతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆస్కార్ స్టేజ్ వరకు వెళ్లి ప్రపంచ సినీ పరిశ్రమలో కూడా పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఒకప్పుడు తన బాడీ మీద ట్రోల్స్ చేసిన వాళ్ళే ఇప్పుడు తన సినిమాల కోసం ఎదురుచూసేలా చేసాడు ఎన్టీఆర్. RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోయే దేవర సినిమా కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. బయట అభిమానులు కూడా పార్టీలతో, సేవా కార్యక్రమాలతో సందడి చేస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..

Also Read : Jabardasth Faima : ప్రియుడిని పరిచయం చేసిన జబర్దస్త్ నటి.. మరి అతనితో ప్రేమ అబద్ధమేనా?

#ఎన్టీఆర్ తల్లి షాలిని కన్నడ మహిళ. అందుకే ఎన్టీఆర్ కి కన్నడ కూడా పర్ఫెక్ట్ గా వచ్చు. తమిళ్, హిందీ, ఇంగ్లీష్ కూడా మాట్లాడగలుగుతాడు. మలయాళం మేనేజ్ చేయగలడు. ఏ భాష అయినా ఈజీగా నేర్చుకోగలడు ఎన్టీఆర్.

#ఎన్టీఆర్ చిన్నప్పుడే కూచిపూడి నేర్చుకున్నాడు. క్లాసికల్ డ్యాన్స్ కూడా ఎన్టీఆర్ బాగా చేయగలడు.

#బ్రహ్మర్షి విశ్వమిత్ర, బాల రామాయణం సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు ఎన్టీఆర్

#2001లో 17 ఏళ్ళ వయసులోనే హీరోగా నిన్ను చూడాలని సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.

# కెరీర్ స్టార్టింగ్ లోనే స్టూడెంట్ నెంబర్ 1, ఆది లాంటి సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరో అయ్యాడు.

#సింహాద్రి సినిమాతో 20 ఏళ్లకే ఇండస్ట్రీ హిట్ కొట్టాడు ఎన్టీఆర్.

# తన బాడీపై బాగా లావు అయ్యాడని, హీరోగా లేడని చాలా విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు సమాధానమిస్తూ చాలా బరువు తగ్గాడు. టెంపర్ సినిమాలో తన పర్ఫెక్ట్ బాడీని షర్ట్ తీసి మరీ చూపించాడు.

#ఒకానొక సమయంలో వరుస ఫ్లాప్స్ చూసిన ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుస హిట్స్ కొడుతూ వస్తున్నాడు.

#ఎన్టీఆర్ బుల్లితెరపై కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసాడు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్ హోస్ట్ గా చేసాడు. ఆ తర్వాత ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాంకి కూడా హోస్ట్ గా చేసాడు.

#ఎన్టీఆర్ లక్ష్మి ప్రణతిని 2011లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్.

#ఎన్టీఆర్ కు నాటుకోడి, గారే అంటే ఇష్టం. అలాగే చికెన్ బిర్యానీ, హలీమ్ కూడా బాగా తింటారు. ఎన్టీఆర్ కి వంట కూడా బాగా చేయడం వచ్చు.

#ఎన్టీఆర్ గతంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల్లో ప్రచారం కూడా చేసాడు.

# ఎన్టీఆర్ ఆరు సినిమాల్లో ఆరు పాటలు పాడాడు ఇప్పటివరకు. అందులో ఒకటి కన్నడ సాంగ్ కూడా ఉంది.

#ఇండియన్ బెస్ట్ డ్యాన్సర్లలో ఎన్టీఆర్ ఒకరు.

#ఎన్టీఆర్ – రామ్ చరణ్ కి, అల్లు అర్జున్ కి, మంచు మనోజ్ కి క్లోజ్ ఫ్రెండ్.

#ఎన్టీఆర్ కి గతంలో A1 స్టార్, యంగ్ టైగర్ అని ట్యాగ్ ఇచ్చారు. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ అని పిలుస్తున్నారు.

#ఎన్టీఆర్ ఎన్నో సార్లు విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వాలకు సహాయం అందించాడు. బయట కూడా పలు సంస్థలకు, ఆలయాలకు డొనేషన్స్ చేసాడు ఎన్టీఆర్.

# ఇప్పుడు ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ 2 సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ట్రెండింగ్ వార్తలు