Threads App: థ్రెడ్స్ యాప్ వచ్చేసింది.. నాలుగు గంటల్లోనే ఐదు మిలియన్ల డౌన్‌లోడ్స్

ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ప్రారంభించిన థ్రెడ్స్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను వినియోగించి లాగిన్ చేసుకోవచ్చు.

Threads App

Mark Zuckerberg: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌కు పోటీగా మెటా సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. థ్రెడ్స్ పేరుతో ఈ యాప్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ట్విటర్ తరహా ఫీచర్లతోనే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.. థ్రెడ్స్ యాప్ ప్లే‌స్టోర్‌లో అందుబాటులోకి తెచ్చిన తొలి రెండు గంటల్లోనే రెండు మిలియన్ల మంది డౌన్ లోడ్లు చేసుకోగా, నాలుగు గంటల్లో ఐదు మిలియన్ల మంది డౌన్‌లోడ్‌లు చేసుకున్నారు. ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్ థ్రెడ్స్ యాప్‌లో తన తొలి పోస్టు చేశారు. ఫైర్ ఎమోజీతో పాటు ఇలారాశారు. యాప్ మొదటి నాలుగు గంటల్లోనే ఐదు మిలియన్ల సైన్‍అప్‌ లను చేసిందని చెప్పారు. థ్రెడ్ యాప్ డౌన్‌లోడ్స్ దూకుడు చూస్తుంటే ట్విటర్ ను మించిపోతాయా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

elon musk and zuckerberg

థ్రెడ్స్ యాప్‌ను ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ప్రారంభించింది. ఇన్‌‌స్టా‌గ్రామ్ అకౌంట్‌ను వినియోగించి లాగిన్ చేసుకోవచ్చునని మెటా పేర్కొంది. ఇందులో సుమారు వర్డ్స్‌తో లింక్స్, ఫొటోలు, ఐదు నిమిషాల నిడివిగల వీడియోలనుసైతం పోస్ట్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ తరహాలోనే ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ఫొటోలు, వీడియోల ద్వారా కనెక్ట్ అవ్వొచ్చు. గూగుల్ ప్లే‌స్టోర్, యాపిల్ ప్లే‌స్టోర్ లలో థ్రెడ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. థ్రెడ్స్ యాప్ డౌన్‌లోడ్స్ దూకుడు చూస్తుంటే ట్విటర్‌ను దాటేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ట్విటర్ యొక్క వినియోగదారుల సామర్థ్యానికి ప్రత్యర్థిగా ఉన్న థ్రెడ్స్‌లో చేరడానికి మెటాకి దాని ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల్లో నాలుగింట ఒక వంతు మాత్రమే అవసరం అవుతుంది.

 

 

ట్విటర్ కంటే థ్రెడ్స్ పైచేయి సాధిస్తుందా? అనే ప్రశ్నకు ఫేస్ బుక్ సీఈఓ ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు. దానికి కొంచెం సమయం పడుతుందని చెప్పాడు. అయితే ఒక బిలియన్ ప్లస్ మంది వ్యక్తులు పబ్లిక్ సంభాషణలో యాప్ ఉండాలని భావిస్తున్నానని చెప్పారు. ఇదిలాఉంటే జకర్‌బర్గ్ థ్రెడ్స్ యాప్ లాంచ్ అయిన తరువాత కొద్దిసేపటికి ట్విటర్‌లో ఓ కార్టూన్ ను పోస్టు చేశారు. స్పైడర్‌మ్యాన్‌గా దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఎదురుపడినట్లు ఉంది. ఈ చిత్రం 1967 స్పైడర్ మాన్ కార్టూన్ “డబుల్ ఐడెంటిటీ” నుండి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు