Redmi 14C Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? రెడ్‌మి 14సి ఫోన్ వచ్చేసిందోచ్.. ధర, స్పెషిఫికేషన్లు ఇవే..!

Redmi 14C Launch : రెడ్‌మి 14సి ధరను కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో బేస్ మోడల్‌కు సీజెడ్‌కే 2,999 (సుమారు రూ. 11,100) వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Redmi 14C With 6.88-Inch LCD Screen, MediaTek Helio G81 Chipset Launched

Redmi 14C Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్‌మి నుంచి సరికొత్త ఫోన్ రెడ్‌మి 14సి కంపెనీ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి 13సి మోడల్ అప్‌గ్రేడ్‌గా వస్తుంది. డిసెంబర్ 2023లో బడ్జెట్ హ్యాండ్‌సెట్, షావోమీ రెడ్‌మి 14సి 6.88-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 5,160mAh బ్యాటరీతో సపోర్ట్ చేసింది. 18డబ్ల్యూ ఛార్జింగ్ ఫోన్ 4 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 50ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ కలిగి ఉంది.

Read Also : Redmi A3x Launch : రెడ్‌మి నుంచి కొత్త ఫోన్ ఇదిగో.. భారీ బ్యాటరీతో రెడ్‌మి A3ఎక్స్ ఫోన్, ధర, ఫీచర్లు ఇవే

రెడ్‌మి 14సి ధరను కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో బేస్ మోడల్‌కు సీజెడ్‌కే 2,999 (సుమారు రూ. 11,100) వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉంది. అయితే, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర సీ‌జెడ్‌కె 3,699 (దాదాపు రూ. 13,700)కు పొందవచ్చు. వినియోగదారులు రెడ్‌మి 14సి డ్రీమీ పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్, సేజ్ గ్రీన్, స్టార్రీ బ్లూ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు పొందవచ్చు. భారత మార్కెట్లో ఈ హ్యాండ్‌సెట్‌ను ప్లాన్లను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

రెడ్‌మి 14సి స్పెసిఫికేషన్లు :
రెడ్‌మి 14సి ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో+నానో) హ్యాండ్‌సెట్, కంపెనీ హైపర్‌ఓఎస్ స్కిన్‌తో ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. 6.88-అంగుళాల (720×1640 పిక్సెల్‌లు) హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 450నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో జీ81 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. గరిష్టంగా 8జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ కలిగి ఉంటుంది.

ఫొటోలు, వీడియోలకు రెడ్‌మి 14సి ఫోన్ ఎఫ్/1.8 ఎపర్చర్‌తో 50ఎంపీ కెమెరాతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో రెండవ లెన్స్ కూడా ఉంది. ఫ్రంట్ సైడ్ హ్యాండ్‌సెట్ ఎఫ్/2.0 ఎపర్చర్‌తో 13ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. రెడ్‌మి 14సిలో 256జీబీ వరకు ఇఎమ్ఎమ్‌సీ 5.1 స్టోరేజీని పొందవచ్చు. మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ, ఎల్‌టీఈ, బ్లూటూత్ 5.4, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, జీపీఎస్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

బోర్డులోని సెన్సార్‌లలో యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, వర్చువల్ సామీప్య సెన్సార్, ఇ-కంపాస్ ఉన్నాయి. రెడ్‌మి 14సి ఫోన్ 5,160mAh బ్యాటరీని కలిగి ఉంది. 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అయితే, రెడ్‌మి ఫోన్ పవర్ అడాప్టర్‌ అందించడం లేదు. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం హ్యాండ్‌సెట్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 171.88×77.8.8.22ఎమ్ఎమ్, కలర్ ఆప్షన్ బట్టి బరువు 207 గ్రాముల నుంచి 211గ్రాముల మధ్య మారవచ్చు.

Read Also : Redmi Watch 5 Active : కొత్త రెడ్‌మి స్మార్ట్‌వాచ్ చూశారా? ఫీచర్లు అదుర్స్.. సింగిల్ ఛార్జ్‌తో 18 రోజుల బ్యాటరీ లైఫ్..!

ట్రెండింగ్ వార్తలు