Delhi : ఉబర్ హీరో.. తన సేవా గుణంతో ప్రయాణికుల మనసు దోచుకున్న క్యాబ్ డ్రైవర్

క్యాబ్ ఎక్కించుకున్నారా? గమ్యస్ధానానికి చేర్చారా? చాలామంది క్యాబ్ డ్రైవర్లు అంతవరకే ఆలోచిస్తారు. మధ్యలో ప్రయాణికులకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా పట్టించుకోరు. కానీ ఢిల్లీలోని ఓ ఉబెర్ డ్రైవర్ అలా కాదు. తన సేవా గుణంతో నెటిజన్ల మనసు దోచుకున్నాడు.

Delhi : స్మార్ట్ ఫోన్ వాడటం ద్వారా ప్రయాణాల్ని సులభతరం చేస్తూ యాప్-క్యాబ్ సేవలు ఆన్ లైన్లో రైడ్ బుక్ చేసుకునే వీలు కల్పిస్తున్నాయి. ఒక్కోసారి కొన్ని ప్రయాణాల్లో కస్టమర్లకు చేదు అనుభవాలు ఎదురైన సందర్భాలు ఉన్నాయి. వీటికి భిన్నంగా ఓ ఉబెర్ డ్రైవర్ అందరి మనసులు గెలుచుకున్నాడు.

Bengaluru : బెంగళూరులో ఉబెర్ ఆటో బుక్ చేసుకున్నారా? ఇక గమ్యస్ధానానికి చేరినట్లే..

ఢిల్లీకి చెందిన డ్రైవర్ అబ్దుల్ ఖదీర్ అసాధారణ సేవా గుణం గురించి వింటే అందరి మనసు చలించిపోతుంది. అతను ఉబెర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ప్రయాణికుల ఇబ్బందుల గురించి ఆలోచించే ఖదీర్ తన కారులో కొన్ని సౌకర్యాలు అమర్చాడు. కారులో స్నాక్స్, నీరు, రసం మరియు అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స చేయడానికి అవసరమైన మెడికల్ కిట్ అన్నీ అమర్చుకున్నాడు. ఇవన్నీ ప్రయాణికులకు ఉచితంగా అందిస్తున్నాడు. అంతేకాదు ప్రయాణీకుల సౌకర్యంతో పాటు.. పిల్లల సంక్షేమానికి సహకరించడానికి తన కారులో విరాళాల బాక్స్‌ను పెట్టాడు. ఇతని కారులో ప్రయాణించిన శ్యామ్‌లాల్ యాదవ్ (Shyamlal Yadav) అనే ట్విట్టర్ వినియోగదారుడు ఖదీర్ ఫోటోతో పాటు అతను ప్రయాణికులకు అందిస్తున్న సేవల గురించి తన ట్వీట్‌లో షేర్ చేశారు. ఈ కథనం నెటిజన్లను ఆకట్టుకుంది.

Female Uber driver story : బీటెక్ గ్రాడ్యుయేట్ ఉబెర్ డ్రైవర్‌గా ఎందుకు మారింది?

నెటిజన్లు ఉబెర్ డ్రైవర్ ఖదీర్ యొక్క నిస్వార్థ సేవను ప్రశంసించారు. ‘అదృష్టవశాత్తూ ఢిల్లీలో అతని క్యాబ్‌లో కూర్చునే అవకాశం నాకు కూడా లభించింది’ అని ఒకరు.. ‘మీరు మీ వృత్తిని ఇష్టపడినప్పుడే ఇలా ఉండగలుగుతారు’ అని మరొకరు వరుసగా కామెంట్లు పెట్టారు.

ట్రెండింగ్ వార్తలు