Yamuna Expressway : యమునా ఎక్స్‌ప్రెస్ వేకి అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు..

యమునా ఎక్స్‌ప్రెస్ వేకి దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

Yamuna Expressway renamed EX PM Vajpayee : ఉత్తరప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్ వేకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టాలని కేంద్రం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. నవంబర్ 25న గౌతమ్ బుద్ధనగర్ జిల్లాలోని జెవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగానే యుమునా ఎక్స్‌ప్రెస్ వే పేరును మారుస్తూ ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.

విమానాశ్రయ శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు బీజేపీకి చెందిన పలువరు ప్రధాన నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా యమునా ఎక్స్ ప్రెస్ వేకు పేరును మారుస్తు బీజేపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. ఈ విషయాన్ని ఓ బీజేపీ నేత వెల్లడించారు. కానీ ఇది పక్కా అని..చెప్పిన సదరు నేత తన పేరును బయటపెట్టటానికి ఇష్టపడలేదు. బహుశా అధిష్టానం నుంచి ఇబ్బందులు వస్తాయనే భయంతో కావచ్చు.

“భారతదేశంలో అత్యంత ప్రియమైన రాజకీయ నాయకులకు గౌరవం ఇవ్వడానికి (ఎక్స్‌ప్రెస్‌వే పేరు మార్చడానికి) నిర్ణయం తీసుకోనున్నట్లుగా బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. దీంట్లో భాగంగానే మాజీ ప్రధాని బీజేపీ సీనియర్ నేత. వివంగత ప్రధాని అయినా అటల్ బిహారీ వాజ్‌పేయి పేరును పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఎక్స్‌ప్రెస్‌వే పేరు మార్చి వాజ్ పేయి పేరు పెట్టటం గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు గుర్తు చేస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు