Love Story : అందుకే వైష్ణవ్ తేజ్ వద్దన్నాడా..?

కేవలం ఆ ఒక్క కారణంతోనే వైష్ణవ్ తేజ్ ‘లవ్ స్టోరీ’ సినిమా వదులుకున్నాడా..!

Love Story: పాండమిక్ తర్వాత మంచి హైప్‌తో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై.. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ కలెక్షన్లు కొల్లగొడుతోంది ‘లవ్ స్టోరీ’ మూవీ.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా, లేదా.. అనే సందేహంతోనే సినిమా రిలీజ్ చేసిన టీంకి తెలుగు ఆడియన్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు. మంచి సినిమా వస్తే ఎలాంటి పరిస్థితిలోనైనా ఆదరిస్తాం అని నిరూపించారు.

Love Story Review : ‘లవ్ స్టోరీ’ రివ్యూ..

ఇక నాగ చైతన్య, సాయి పల్లవిల కెమిస్ట్రీ, డ్యాన్స్, శేఖర్ కమ్ముల కథతో పాటు చెప్పిన మెసేజ్ ప్రేక్షకుల మనసుకి దగ్గరవడంతో సినిమా మ్యాజికల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాలో మొదట మెగా మేనల్లుడు, ‘ఉప్పెన’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన పంజా వైష్ణవ్ తేజ్‌ని హీరోగా అనుకున్నారట.

Love Story : జాతరను తలపిస్తున్న థియేటర్లు..

‘ఉప్పెన’ కథకు ‘లవ్ స్టోరీ’ కథ చాలా దగ్గరగా ఉందనిపించడంతో వైష్ణవ్ నో చెప్పాడని అంటున్నారు. ఎందుకంటే పెద్ద క్యాస్ట్ అమ్మాయిని తక్కువ క్యాస్ట్ కుర్రాడు ప్రేమించడం.. అది నచ్చని అమ్మాయి తండ్రి హీరో మీద ఎటాక్ చెయ్యడం (కాకపోతే ‘లవ్ స్టోరీ’ లో బాబాయ్) వంటివి ఉండడంతో ఒకే సినిమాని రెండు సార్లు చేశామనే ఫీలింగ్ వస్తుందనే వైష్ణవ్ తేజ్, శేఖర్ కమ్ములకు నో చెప్పాడనే వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

Love Story : సరైన టైంలో సాలిడ్ హిట్ కొట్టిన చైతూ

‘ఉప్పెన’ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్.. క్రిష్ డైరెక్షన్లో చేసిన ‘కొండ పొలం’ అక్టోబర్ 8న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రోమోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వైష్ణవ్ ఫస్ట్ టైం సీనియర్ హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ ఓబులమ్మ క్యారెక్టర్‌లో కనిపించనుంది.

ట్రెండింగ్ వార్తలు