Pushpa: వెనక్కు తగ్గనున్న పుష్పరాజ్?.. వాయిదా తప్పదా?

టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా కొత్త సినిమాల సందడి కనిపిస్తుంది. కొత్త కొత్త క్రేజీ సినిమాలు విడుదల తేదీలను ఖరారు చేసుకున్నాయి. ఒకటీ రెండు పెద్ద సినిమాలు మినహా..

Pushpa: టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా కొత్త సినిమాల సందడి కనిపిస్తుంది. కొత్త కొత్త క్రేజీ సినిమాలు విడుదల తేదీలను ఖరారు చేసుకున్నాయి. ఒకటీ రెండు పెద్ద సినిమాలు మినహా పెద్ద సినిమాలన్నీ డేట్స్ ఇచ్చేశాయి. ఈ ఏడాది వస్తాడా రాడా అనుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప రాజ్ కూడా నో డౌట్ అనుకున్న టైంకి వచ్చేస్తానని ఖరాకండీగా చెప్పేశాడు. పుష్ప మేకర్స్ నుండి ఫస్ట్ పార్ట్ విడుదల తేదీ ఇదేనని డిసెంబర్ 17 లాక్ చేశారు.

Priyanka Jawalkar: డోస్ పెంచేస్తున్న అనంతపురం అందాలభామ!

డిసెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీకి సంబందించి ప్రమోషన్లు ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ప్రజెంట్ రిలీజ్ కు రెడీ అవుతున్న ఏ పెద్ద సినిమాకీ లేనంత దూకుడు చూపిస్తే.. పుష్ప ఫీవర్ ని ఫాన్స్ లో తెగపెంచేస్తున్నాడు బన్నీ. వరసగా ఒక్కో పాటను విడుదల చేస్తూ సినిమాలో ఒక్కో పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ మెల్లగా స్లో పాయిజన్ మాదిరి సినిమా మీద ఎక్కడ లేని అంచనాలను పెంచేస్తున్నాడు. అయితే, ఈ సినిమా విడుదల తేదీపై అనుమానాలు తెచ్చేలా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

Sri Reddy: నా జుట్టు వెనుక పెద్ద ఖజానా ఉంది.. శ్రీరెడ్డి బోల్డ్ లైవ్ వైరల్!

డిసెంబర్ 17న ఈ సినిమా రావడం కష్టమేనని ఈ ప్రచారం సారాంశం. ప్రస్తుతం ఇంకా సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో ఈ తేదీకి సినిమా వస్తుందా రాదా అనే అనుమానాలను కొందరి ఇలా ప్రచారం చేస్తున్నారు. కాగా, రెండు పార్టులుగా రానున్న ఈ సినిమాకు సంబంధించి తొలి పార్ట్ షూటింగ్ పూర్తికాగా ఇప్పుడు జరుగుతున్న షూటింగ్ రెండో పార్ట్ కి సంబంధించిన వర్క్ అని మరికొందరు కవర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఇది ఎంతవరకు నిజమన్నది మేకర్స్ స్పందిస్తేకానీ తెలియదు.

ట్రెండింగ్ వార్తలు