Shaakuntalam: శాకుంతలం రిలీజ్ మళ్లీ డౌటేనా.. ఆ హీరో సినిమానే కారణమా..?

స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ హిస్టారికల్ మూవీ ‘శాకుంతలం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తుండగా, భారీ పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ‘శాకుంతలం’ ఎట్టకేలకు ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.

Shaakuntalam: స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ హిస్టారికల్ మూవీ ‘శాకుంతలం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తుండగా, భారీ పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ‘శాకుంతలం’ ఎట్టకేలకు ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.

Shaakuntalam : 3 కోట్ల నగలతో, 30 కేజీల బరువుతో సమంత శాకుంతలం షూటింగ్..

అయితే ఈ సినిమా కోసం కేవలం టాలీవుడ్ ప్రేక్షకులే కాకుండా, ఇతర భాషల్లోని సమంత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కానుందని అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్న తరుణంలో ఈ సినిమా రిలీజ్‌పై మరోసారి అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ సినిమాకు ఇతర భాషల్లో రిలీజ్ ఇబ్బందికరంగా మారుతుందట. ఫిబ్రవరి 17న బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ నటిస్తున్న ‘షెహజాదా’ మూవీ కూడా రిలీజ్ అవుతుండటంతో, థియేటర్ల సమస్య ఏర్పడుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Shaakuntalam: ఋషివనంలోన శకుంతల, దుష్యంతుడి ప్రేమగీతం.. వినసొంపుగా ఉందిగా!

తొలుత షెహజాదా చిత్రాన్ని ఫిబ్రవరి 10న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించినా, పఠాన్ సినిమా తుఫాన్ ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ సినిమాను ఫిబ్రవరి 17న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు శాకుంతలం సినిమాపై పడబోతుందని తెలుస్తోంది. మరి నిజంగానే మరోసారి శాకుంతలం సినిమా రిలీజ్‌ను వాయిదా వేసుకుంటుందా.. లేక అనుకున్న తేదీనే రిలీజ్ అవుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు