Windows 11 Bug : కొత్త విండోస్‌ 11 వెర్షన్‌లో బగ్‌.. మానిటర్ రంగులు మార్చేస్తుంది..!

ప్రముఖ మైక్రోసాఫ్ట్ టెక్ దిగ్గజం విండోస్ 11 వెర్షన్ ప్రవేశపెట్టింది. కొత్తగా రిలీజ్ చేసిన ఈ వెర్షన్‌లో బగ్స్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు యూజర్లు.

Windows 11 Bug :  ప్రముఖ మైక్రోసాఫ్ట్ టెక్ దిగ్గజం విండోస్ 11 వెర్షన్ ప్రవేశపెట్టింది. కొత్తగా రిలీజ్ చేసిన ఈ వెర్షన్‌లో బగ్స్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు యూజర్లు. ఇప్పటికే పలు బగ్స్ గుర్తించగా… మరో కొత్త బగ్ యూజర్లను ఇబ్బంది పెడుతోంది. ఈ బగ్ కారణంగా HDR Monitors వైట్ కలర్ బ్రైట్ ఎల్లో కలర్లలోకి మారిపోతోంది. విండోస్ 11 వెర్షన్ లో మాత్రమే ఈ రకమైన బగ్ ఇష్యూ ఎక్కువగా కనిపిస్తున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా వీడియో ఎడిటింగ్, ఫొటో ఎడిటర్లకు తీవ్ర అంతరాయం కలుగుతుందని అంటున్నారు. విండోస్ 11 వెర్షన్ బగ్స్ ఇష్యూకు సంబంధించి యూజర్లు మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఫిర్యాదు చేశారు. యూజర్ల ఫిర్యాదు మేరకు మైక్రోసాఫ్ట్ కంపెనీ స్పందించింది.  విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ స్టాల్ చేసుకున్న యూజర్లకు వారి మానిటర్లలో రంగురంగులు మారిపోవడాన్ని గమనించినట్టు చెబుతున్నారు.

HDR మానిటర్స్ వైట్ కలర్ బ్రైట్ ఎల్లో కలర్ సమస్య ఉన్నట్టుగా గుర్తించినట్టు మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఎందుకు ఇలాంటి సమస్య తలెత్తుందో మైక్రోసాఫ్ట్ వివరణ కూడా ఇచ్చింది. ప్రత్యేకమైన సందర్భాల్లో Win32 API తప్పుగా డేటాను ట్రాన్స్ ఫర్ చేయడం ద్వారా కలర్ రెండరింగ్ ప్రోగాంకు పంపడం జరుగుతోంది. ఇలాంటి సమాయాల్లో మానిటర్ కలర్ మారిపోవడం జరుగుతుందని గుర్తించినట్టు పేర్కొంది. ఈ సమస్య అన్ని రంగుల్లో లేదని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి తెలిపారు. బగ్ సమస్యను గుర్తించామని, అత్యంత త్వరలో బగ్ ఫిక్స్ చేస్తామని మైక్రోసాఫ్ట్ బ్లాగులో తెలిపింది. Window 11 సెట్టింగ్ పేజ్, మైక్రోసాఫ్ట్ కలర్ కంట్రోల్ ప్యానెల్ కలర్ ప్రొఫైల్ ప్రోగ్రామ్ బాగానే వర్క్ చేస్తున్నాయని అంటోంది. బగ్ ఫిక్స్ చేసేంతవరకు యూజర్లు వీటి ద్వారా పనిచేసుకోవచ్చునని తెలిపింది.

విండోస్ 11 వెర్షన్ ఇన్ స్టాల్ చేసుకున్న చాలామంది యూజర్ల నుంచి మైక్రోసాఫ్ట్ కు ఫిర్యాదులు అందుతున్నాయి. స్నిపింగ్ టూల్ సరిగా పనిచేయడం లేదని కొందరు ఫిర్యాదు చేయగా.. టచ్ కీ బోర్డు, వాయిస్ టైపింగ్ టూల్, ఎమోజీ ప్యానెల్, ఎస్ మోడ్ ఫీచర్లు కూడా సరిగా పనిచేయలేదు. యూజర్ల ఫిర్యాదులో ఈ బగ్స్ అన్నింటిని ఫిక్స్ చేసింది మైక్రోసాఫ్ట్. గతకొన్ని రోజులుగా విండోస్ 11 వెర్షన్ ఇన్ స్టాల్ చేసిన కంప్యూటర్లలో AMD Risen Processor  పర్ఫార్మెన్స్ స్లో అయినట్టు యూజర్లు కంప్లయింట్ చేశారు. ఈ బగ్ ఎక్కడ ఉందో గుర్తించిన మైక్రోసాఫ్ట్..  Windows 11 Built 220000.282 Update రిలీజ్ చేసింది. ఓల్డ్ OS సిస్టమ్‌లతో పోలిస్తే.. విండోస్ 11 వెర్షన్‌లో మైక్రోసాఫ్ట్ ఇంట్రెస్టింగ్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్ యాప్స్ నేరుగా విండోస్ 11లో స్టార్ట్ మెనూ స్క్రీన్ మధ్యలో సెట్ చేసింది మైక్రోసాప్ట్.. ఏది ఏమైనా మైక్రోసాఫ్ట్ విండోస్ 11 వెర్షన్ లో తలెత్తే ఒక్కో బగ్ ఫిక్స్ చేస్తూ వస్తోంది.

Read Also : Coronavirus France : ఫ్రాన్స్‌లో కరోనా కల్లోలం.. రికార్డు స్థాయిలో 2 లక్షలకు చేరిన కొత్త రోజువారీ కేసులు

ట్రెండింగ్ వార్తలు