Chicken : చికెన్ అతిగా తింటున్నారా…అయితే జాగ్రత్త?…

వండిన 24 గంటలలో చికెన్ ను తినకపోతే హనీకరమైన బ్యాక్టీరియాకు చికెన్ నిలయమవుతుంది. పాడైన చికెన్ తింటే ఎన్నో రకాల ఆనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.

Chicken : సాధారణంగా తినే మాంసాహారాలలో కోడి మాంసం ఒకటి. దీనినే చికెన్ అని కూడా పిలుస్తారు. చికెన్‌ అంటే చాలా మందికి ఇష్టం. ఎంతో ఇష్టపడి తింటారు. ఇతర మాంసాలతో పోలిస్తే చికెన్ సరసమైన అందుబాటు ధరలో లభిస్తుంది. దీంతో చాలా మంది కనీసం వారానికి ఒక్కసారైనా తింటారు. కొంతమంది అయితే, ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్లు రోజూ తినేవారు కూడా ఉన్నారు. ఫాస్ట్ ఫుడ్ల తయారీల్లోను కోడి మాంసం ఓ ముఖ్యమైన పదార్ధంగా ఉపయోగిస్తున్నారు.

చికెన్ తినడం వల్ల మన శరీరంలో ప్రొటీన్స్ పెరుగుతాయి. ప్రొటీన్స్ వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా అనేక రకాల వైరస్ లను ఎదుర్కోనే శక్తి మన శరీరానికి వస్తుంది. అయితే ఫారం కోళ్ళను తినటం వల్ల అనారోగ్యం పాలవుతారని నిపుణులు చెబుతున్నారు. నాటు కోళ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదట.

చికెన్ ను ఎక్కువ మోతాదులో తినడం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా చికెన్‌ తింటేనే మన బాడీలో ప్రోటిన్స్‌ లెవల్‌ పెరుగుతాయి. ఈ ప్రోటిన్స్‌ వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వారానికి రెండు మూడు సార్లు చికెన్‌ తింటే ఫర్వాలేదు కానీ, వారంలో 3 లేదా 4సార్ల కంటే ఎక్కువ సార్లు తింటే అటువంటి వారికి ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు తప్పవు.

ప్యాకెట్లలో లభించే ప్రాసెస్డ్‌ చికెన్‌ కంటే మనం తెచ్చుకుని వండుకోవడం మేలు. అయితే చికెన్‌ కంటే చేపలు, తాజా పండ్లు, కూరగాయలు తినడం ఎంతో మంచిదంటున్నారు నిపుణులు. రోజుకు 170 గ్రాములకు మించి తినకూడదని అంటున్నారు. అంతకంటే ఎక్కువ తింటే, ఫుడ్‌ పాయిజనింగ్, డయేరియా, ఇంకా క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక రోగాలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.

అంతేకాకుండా చికెన్‌ పై సాల్మొనెల్లా, క్యాంపీలోబాక్టెర్‌ బ్యాక్టీరియా ఉంటాయి. అందుకే దీన్ని తీసుకువచ్చిన రెండు మూడు గంటల్లో వండుకోవాలి. అలా కాకుండా ఫ్రిజ్‌లో పెట్టి కొద్దికొద్దిగా వండుకుంటూ ఉంటే ఈలోగా ఈ బ్యాక్టీరియా పెరిగి పాయిజనింగ్‌ అవుతుంది. డాక్టర్లు ఈ-కోలి బ్యాక్టీరియా చికెన్‌ పై ఉంటుందని తేల్చారు. అన్ని చికెన్ల పైనా ఉండదు. ఇది కేవలం నిల్వ ఉన్న చికెన్‌ పైన ఉంటుంది. ఇది డయేరియా, నిమోనియా, ఊపిరి ఆడని సమస్యలకు కూడా దారితీస్తుంది. వండిన 24 గంటలలో చికెన్ ను తినకపోతే హనీకరమైన బ్యాక్టీరియాకు చికెన్ నిలయమవుతుంది. పాడైన చికెన్ తింటే ఎన్నో రకాల ఆనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.

కోళ్లఫారంలలో కోళ్లు తినే ఆహారం మొక్క జొన్న. దీంతో ఆ కోళ్లకు కొవ్వు పట్టేస్తుంది. ఆ చికెన్‌ మనం తింటే మనకూ ఆ-కొలెస్ట్రాల్‌ పట్టుకుంటుంది. కొంతమంది చికెన్‌ ఎక్కువ తిన్నా.. వారు వర్కౌవుట్స్‌ చేస్తారు. కాబట్టి వారికి కొవ్వు పట్టదు. చికెన్‌ ఎప్పుడు తిన్నా కేవలం కూరలా చేసుకొని తింటే మంచిది. ఫ్రై చేసుకుని తినకూడదు. ఎందుకంటే, అది శరీరంలోకి వెళ్లి క్యాన్సర్‌ సోకేందుకు కారణం అవుతుందని పరిశోధనలు తేల్చాయి.

చికెన్ వల్ల కలిగే లాభాలే కాకుండా చికెన్ వల్ల కలిగే నష్టాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అపరిశుభ్రంగా వండిన చికెన్ వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. జీర్ణక్రియ మందగిస్తుంది. చికెన్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల చికెన్ ను జీర్ణించుకోవడం కొంచెం కష్టతరమవుతుంది. చికెన్ ను జీర్ణించుకోవడం కొన్ని గంటలు పడుతుంది. కొన్ని సార్లు సహజసిద్ధమైన చికెన్ కు బదులు ఫాక్టరీ నుంచి కొన్ని రకాల హార్మోన్స్ తో తయారైన చికెన్ లను మార్కెట్ లోకి వదులుతున్నారు. చికెన్ ను కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

 

ట్రెండింగ్ వార్తలు