Krishnam Raju : కృష్ణంరాజు స్మృతివనం కోసం రెండెకరాల స్థలం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..

రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు గౌరవార్థం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొగల్తూరు తీర ప్రాంతంలో అయన స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల భూమిని మంజూరు చేయాలని.........................

Krishnam Raju :  రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం ప్రభాస్ తో పాటు సినీ పరిశ్రమకి తీరని లోటు. తాజాగా కృష్ణంరాజు సొంతూరు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో అయన సంస్మరణ సభను ఏరాప్టులు చేశారు. దీనికి భారీ సంఖ్యలో అభిమానులు, జనాలు, ప్రముఖులు వచ్చారు. ఏపీ ప్రభుత్వం తరపున మంత్రులు కారుమూరి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రోజా సెల్వమణి, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు హాజరయి కృష్ణంరాజుకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు గౌరవార్థం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొగల్తూరు తీర ప్రాంతంలో అయన స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల భూమిని మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొగల్తూరులో జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన రోజా సెల్వమణి ప్రకటించారు.

HariHara Veeramallu Workshop : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూట్ వర్క్‌షాప్

ఆంధ్రప్రదేశ్ సాంసృతిక, పర్యాటక శాఖ మంత్రి రోజా మొగల్తూరులో మీడియాతో మాట్లాడుతూ.. ”కృష్ణంరాజు మరణంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. సినీ, రాజకీయ రంగాల్లో అయన సేవలు మరువలేనివి. మొగల్తూరు తీర ప్రాంతంలో కృష్ణంరాజు గారి స్మృతివనం ఏర్పాటు కోసం రెండెకరాల స్థలం రాష్ట్ర టూరిజం డిపార్ట్‌మెంట్‌ తరపున కేటాయిస్తున్నాము. అయన స్మృతివనం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అన్నిరకాలుగా సహకరిస్తుంది” అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు