Mahesh Vitta : సైలెంట్‌గా పెళ్లి చేసేసుకున్న బిగ్ బాస్ ఫేమ్, కమెడియన్ మహేష్ విట్టా.. అమ్మాయి ఎవరో తెలుసా?

తాజాగా మహేష్ విట్టా సైలెంట్ గా తాను ప్రేమించిన అమ్మాయి శ్రావణిని పెళ్లి చేసుకున్నాడు. మహేష్ విట్టా సొంత ఊరు ప్రొద్దుటూరులో సింపుల్ గా, కేవలం ఫ్యామిలీలు, సన్నిహితుల మధ్యే వీరి వివాహం జరిగింది.

Bigg Boss Fame Comedian Mahesh Vitta love Marriage happened with Software Employee Shravani

Mahesh Vitta :  యూట్యూబ్‌లో(You Tube) తన చిత్తూర్ స్లాంగ్‌తో షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న మహేష్ విట్టా అనంతరం ఫన్ బకెట్(Fun Bucket) కామెడీ సిరీస్ తో మెప్పించాడు. ఓ పక్క యూట్యూబ్ లో వీడియోలు చేస్తూనే పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా చేశాడు. బిగ్ బాస్ సీజన్ 3 (Bigg Boss 3)లో పాల్గొని మరింత ఫేమస్ అయ్యాడు మహేష్ విట్టా. ఆ సీజన్ లో దాదాపు 13 వారల పైనే ఉండి ఎలిమినేట్ అయ్యాడు.

బిగ్‌బాస్‌‌ నుంచి బయటకి వచ్చాక పలు సినిమాల్లో వరుస అవకాశాలు సంపాదించాడు మహేష్ విట్టా. అదే సమయంలో తన ప్రేమ విషయాన్ని కూడా తెలిపాడు. తన సిస్టర్ ద్వారా పరిచయమైన ఓ అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు, లైఫ్ లో ఇంకొంచెం సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటాను అని గతంలోనే చెప్పాడు మహేష్ విట్టా.

Director Shiva Nirvana : ఖుషి సినిమాలో విజయ్ సమంత లిప్ కిస్ గురించి క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ.. అందుకే పెట్టాను..

తాజాగా మహేష్ విట్టా సైలెంట్ గా తాను ప్రేమించిన అమ్మాయి శ్రావణిని పెళ్లి చేసుకున్నాడు. మహేష్ విట్టా సొంత ఊరు ప్రొద్దుటూరులో కేవలం ఫ్యామిలీలు, సన్నిహితుల మధ్యే వీరి వివాహం జరిగింది. తాజాగా మహేష్ స్వయంగా తన పెళ్లి ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో పలువురు ప్రముఖులు మహేష్ కి అభినందనలు తెలుపుతున్నారు. ఇక మహేష్ శ్రావణి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేష్ చేసుకున్న అమ్మాయి శ్రావణి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు