Raayan Day 1 Collection : తొలి రోజే రూ.12కోట్ల‌కు పైగా కొల్ల‌గొట్టిన ధ‌నుష్ ‘రాయ‌న్’.. తెలుగులో ఎంతంటే..?

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ న‌టించిన సినిమా రాయ‌న్‌.

Raayan Box Office Collection Day 1 twelve crore on opening day

Raayan : త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ న‌టించిన సినిమా రాయ‌న్‌. ధ‌నుష్ కెరీర్‌లో 50వ సినిమాగా తెర‌కెక్కిన ఈ చిత్రానికి ఆయ‌నే ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం గ‌మ‌నార్హం. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, దుషారా విజయన్, అపర్ణ బాలమురళి లు కీల‌క పాత్ర‌లు పోషించారు. శుక్ర‌వారం (జూలై 26) ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. రివేంజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ మూవీ అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది.

ఈ క్ర‌మంలో తొలి రోజు మంచి క‌లెక్ష‌న్స్‌నే సాధించిన‌ట్లుగా తెలుస్తోంది. ట్రేడ్ గ‌ణాంకాల ప్ర‌కారం.. తొలి రోజు 12.5 కోట్ల నెట్ క‌లెక్ష‌న్స్ సాధించింది. తెలుగు వ‌ర్సెన్ నుంచి రూ.1.5కోట్లు రాగా త‌మిళ వెర్ష‌న్‌కు రూ.11.5 కోట్లు వ‌చ్చాయి. తొలి రోజు త‌మిళంలో రాయ‌న్ మూవీకి 58.65 శాతం ఆక్యుపెన్సీ న‌మోదైంది. శ‌ని, ఆదివారాల్లో ఈ చిత్ర క‌లెక్ష‌న్లు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు సినీ పండితులు చెబుతున్నారు.

Chiranjeevi : ఇండియాలోనే కాదు పారిస్‌లో కూడా మెగాస్టార్ రేంజ్.. ఒలంపిక్ టార్చ్‌తో మెగాస్టార్..

కథ : కార్తవ రాయన్(ధనుష్) తన తమ్ముళ్లు ముత్తువేల్ రాయన్(సందీప్ కిషన్), మాణిక్యం రాయన్(కాళిదాస్ జయరామ్), తన చెల్లి దుర్గ(దుషారా విజయన్) లను ఇంట్లో ఉంచి చిన్నప్పుడు బయటకి వెళ్లి వస్తానని చెప్పి తల్లితండ్రులు తిరిగిరారు. తల్లితండ్రులు ఏమయ్యారో తెలీక ఊర్లో తమకు తెలిసిన వ్యక్తికి చెప్తే అతను తన చెల్లిని అమ్మడానికి ప్రయత్నిచడంతో అతన్ని రాయన్ చంపేసి ఆ ఊరు నుంచి బయటకి వచ్చి దూరంగా బతుకుతారు. ఓ మార్కెట్లో శేఖర్(సెల్వ రాఘవన్) వీళ్లకు ఆసరా ఇస్తాడు.

పెద్దయ్యాక రాయన్ ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బండి నడుపుకుంటూ ఉంటాడు. చెల్లి ఇంట్లోనే ఉంటుంది. చిన్న తమ్ముడు కాలేజీకి వెళ్లి చదువుకుంటాడు. ముత్తువేల్ మాత్రం ఏదో ఒక గొడవల్లో తలదూరుస్తూ గాలికి తిరుగుతూ ఉంటాడు. రాయన్ తన చెల్లి జోలికి, తన తమ్ముళ్ల జోలికి ఎవరు వచ్చినా వదిలిపెట్టడు. ఆ ఊళ్ళో దొరై(శరవణన్), సీతారాం(SJ సూర్య)లు రౌడీలుగా ఒకరికొకరు వేరువేరు గ్యాంగ్స్ తో ఉంటారు. ఆ ఊరికి పోలీసాఫీసర్(ప్రకాష్ రాజ్) అక్కడున్న రౌడీలని అంతం చేయడానికి పగతో వస్తాడు. అనుకోకుండా దొరై చనిపోతాడు. సీతారాం రాయన్ ని చంపించడానికి ట్రై చేస్తాడు. అసలు రాయన్ ని సీతారాం ఎందుకు చంపాలి అనుకుంటాడు? దొరైని ఎవరు చంపారు? పోలీసాఫీసర్ ఏం చేసాడు? రాయన్ చెల్లి కోసం ఏం చేసాడు? తమ్ముళ్లు ఇద్దరు ఏం అయ్యారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Hanuman : జపాన్‌లో హనుమాన్ రిలీజ్.. ఎప్పుడంటే..? హనుమాన్ జపనీస్ ట్రైలర్ చూశారా?

ట్రెండింగ్ వార్తలు