Hanuman : జపాన్‌లో హనుమాన్ రిలీజ్.. ఎప్పుడంటే..? హనుమాన్ జపనీస్ ట్రైలర్ చూశారా?

తాజాగా ఇప్పుడు హనుమాన్ సినిమా కూడా జపాన్ లో రిలీజ్ కాబోతుంది.

Hanuman : జపాన్‌లో హనుమాన్ రిలీజ్.. ఎప్పుడంటే..? హనుమాన్ జపనీస్ ట్రైలర్ చూశారా?

Prasanth Varma Teja Sajja Hanuman Movie Releasing in Japan

Updated On : July 27, 2024 / 1:26 PM IST

Hanuman – Japan : మన తెలుగు సినిమాలకు విదేశాల్లో మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. అమెరికా తర్వాత జపాన్ లో మన తెలుగు సినిమాలకు భారీ మార్కెట్ ఏర్పడింది. బాహుబలి నుంచి RRR, సలార్, రంగస్థలం.. ఇలా పలు సినిమాలు జపాన్ లో రిలీజయి భారీ హిట్ కొట్టాయి. అక్కడ కూడా భారీ కలెక్షన్స్ సాధించాయి. RRR సినిమా సమయంలో జపాన్ వాళ్ళు చేసిన హడావిడి మనం మరచిపోలేము.

RRR సినిమా జపాన్ లో సరికొత్త రికార్డులని కొల్లగొట్టింది. మన తెలుగు సినిమాల కోసం జపాన్ వాళ్ళు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇప్పుడు హనుమాన్ సినిమా కూడా జపాన్ లో రిలీజ్ కాబోతుంది. అయితే జపనీస్ లో డబ్బింగ్ చెప్పకుండా తెలుగు వర్షన్ నే జపనీస్ సబ్ టైటిల్స్ తో హనుమాన్ సినిమాని జపాన్ లో రిలీజ్ చేయబోతున్నట్టు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలిపాడు.

Also Read : Allari Naresh : సైలెంట్ గా కొత్త సినిమా మొదలుపెట్టేసిన అల్లరి నరేష్..

దానికి సంబంధించిన జపనీస్ హనుమాన్ ట్రైలర్ షేర్ చేసి అక్టోబర్ 4న జపాన్ లో హనుమాన్ సినిమా రిలీజ్ కాబోతుందని ప్రకటించాడు. ప్రమోషన్స్ కూడా బాగానే చేయబోతున్నట్టు సమాచారం. ఈ సంవత్సరం సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చి భారీ హిట్ కొట్టి ఏకంగా 350 కోట్ల కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా. మరి ఇప్పుడు జపాన్ లో ఇంకెన్ని కోట్లు కొల్లగొడుతుందో చూడాలి. మీరు కూడా జపనీస్ హనుమాన్ ట్రైలర్ చూసేయండి..