Waheeda Rehman : తమిళ నటి వహీదా రెహ్మాన్.. తెలుగు సినిమాతో ఎంట్రీ.. బాలీవుడ్‌లో బిగ్ స్టార్‌గా..

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ వహీదా రెహ్మాన్.. తమిళ సినిమాల్లో ఛాన్స్ అందుకొని తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.

Bollywood Actress Waheeda Rehman cinema career and awards

Waheeda Rehman : బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ వహీదా రెహ్మాన్.. అత్యున్నత సినీ పురస్కారం అయిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని (Dadasaheb Phalke Lifetime Achievement Award) ఈ ఏడాదికి గాను అందుకున్నారు. దీంతో ఆమెకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతలో వహీదా సినీ ప్రయాణం అసలు ఎలా మొదలైంది..? ఆమె నటి అవ్వాలనే ఇండస్ట్రీకి వచ్చారా..?

Jawan : జవాన్ యాక్షన్ సీన్ ఎలా షూట్ చేసారో చూశారా..? కారుని గాలిలోకి..!

వహీదా రెహ్మాన్ తమిళనాడుకి చెందిన ఒక ముస్లిం కుటుంబంలో ఫిబ్రవరి 3న జన్మించారు. వహీదాకి ముగ్గురు అక్కలు ఉన్నారు. చిన్నప్పుడే వీరంతా భరతనాట్యంలో ఎంతో ప్రావిణ్యం సాధించారు. దీంతో పలు వేదికల పై నాట్య ప్రదర్శన కూడా ఇస్తూ వచ్చేవారు. వహీదా రెహ్మాన్ కి డాక్టర్ అవ్వాలని కోరిక ఉండేది. అయితే తండ్రి మరణం, ఆర్ధిక ఇబ్బందుల కారణాలు వల్ల సినిమా రంగం వైపు ఆమె అడుగులు వేయాల్సి వచ్చింది.

ఆమెకు ఉన్న డాన్సింగ్ టాలెంట్ తో సినిమాలో ఆఫర్లు అందుకున్నారు. ముందుగా తమిళ సినిమాలోని ఒక సాంగ్ ఆఫర్ ని అందుకున్నారు. సినిమాల్లో ఆమెకు అదే మొదటి అవకాశం. అయితే ఈ మూవీ రిలీజ్ అవ్వడాన్ని కంటే ముందు తెలుగు సినిమా రిలీజ్ అవ్వడంతో వహీదా తెలుగు మూవీతో ఆడియన్స్ కి పరిచయమయ్యారు. ఏఎన్నార్ నటించిన ‘రోజులు మారాయి’ సినిమాలోని ‘ఏరువాక’ సాంగ్ లో డాన్స్ చేసి తెరగేంట్రం చేశారు.

Waheeda Rehman : సినీ అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2021.. ఎంపికైన బాలీవుడ్ సీనియర్ నటి..

ఆ తరువాత ఎన్టీఆర్ ‘జయసింహ’ సినిమాలో నటిగా పరిచయమయ్యారు. ఈ రెండు సినిమాలు తరువాత తమిళ్ సినిమాలు రెండు రిలీజ్ అయ్యాయి. ఆ రెండిటిలో స్పెషల్ సాంగ్స్ లోనే వహీదా కనిపించారు. ఇక నాలుగు చిత్రాలు తరువాత బాలీవుడ్ కి వెళ్లిన వహీదా.. అక్కడ బిగ్ స్టార్ గా ఎదిగారు. మలయాళీ, బెంగాలీ, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా వహీదా నటించి అలరించారు. దాదాపు 100కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.

నటిగా వహీదా రెహ్మాన్.. ఫిలిం అవార్డులు, పలు స్టేట్ అవార్డులు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డులను కూడా అందుకున్నారు. అలాగే భారత్ ప్రభుత్వం నుంచి పద్మశ్రీ , పద్మ భూషణ్ అవార్డులను సైతం తీసుకున్నారు. తాజాగా సినీ పరిశ్రమలోని వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని కూడా సొంతం చేసుకున్నారు. ఇప్పటికి ఇంకా నటిస్తూనే ఉన్న వహీదా రెహ్మాన్ రానున్న రోజుల్లో ఇంకెన్ని అవార్డులను సొంతం చేసుకుంటారో చూడాలి.

 

ట్రెండింగ్ వార్తలు