Bimbisara: బింబిసార కళ్యాణ్ రామ్ కాదా.. మరెవరు?

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ ఫాంటెసీ థ్రిల్లర్ మూవీ ‘బింబిసార’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే నిజానికి, ఈ సినిమాలో హీరో బింబిసార కాదట. దర్శకుడు వశిష్ఠ ఈ చిత్ర కథను తొలుత వేరొక స్టార్ హీరోకు వినిపించాడట.

Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ ఫాంటెసీ థ్రిల్లర్ మూవీ ‘బింబిసార’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన విధానం అత్యద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక చాలా రోజుల తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ ఈ స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే నిజానికి, ఈ సినిమాలో హీరో బింబిసార కాదట. దర్శకుడు వశిష్ఠ ఈ చిత్ర కథను తొలుత వేరొక స్టార్ హీరోకు వినిపించాడట.

Bimbisara Collections: బింబిసార 2 రోజుల కలెక్షన్స్.. బొమ్మ బ్లాక్ బస్టర్!

కళ్యాణ్ రామ్ కాకుండా వేరొక హీరోనా? అనుకుంటున్నారా.. అవును.. ఈ సినిమా కథను దర్శకుడు తొలుత మాస్ రాజా రవితేజకు వినిపించాడట. ఈ సినిమాకు రవితేజ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతాడని వశిష్ఠ భావించాడట. అయితే కథ విన్నాక, రవితేజ ఈ సినిమా తనకు సెట్ అవ్వదని.. ఒకవేళ చేసినా, కొత్త దర్శకుడు ఇంత భారీ విజువల్స్ ఉండే సినిమాను హ్యాండిల్ చేస్తారో లేదో అనే సందేహంతో ఈ సినిమాకు నో చెప్పాడట.

Bimbisara: బింబిసార సక్సెస్.. నందమూరి ఫ్యాన్స్ హ్యాపీ!

దీంతో వశిష్ఠ ఈ సినిమా కథను కళ్యాణ్ రామ్‌కు వినిపంచారట. కళ్యాణ్ రామ్‌కు హోం బ్యానర్, సొంత గ్రాఫిక్స్ స్టూడియో ఉండటంతో ఆయన అయితే ఈ సినిమాను బాగా తీసుకొస్తాడని ఆయన అనకున్నాడట. అలాగే, ఈ సినిమా ఔట్‌పుట్ కూడా రావడంతో వశిష్ఠ ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం మరో మేజర్ అసెట్‌గా నిలిచింది. ఈ సినిమాతో దర్శకుడు వశిష్ఠ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడని చెప్పాలి.

ట్రెండింగ్ వార్తలు