Ambati Rayudu : బీసీసీఐ అలా చేస్తే.. మ‌రికొన్నాళ్లు ధోని ఐపీఎల్‌లో ఆడ‌తాడు

ఐదు సార్లు ఛాంపియ‌న్ అయిన చెన్నై సూప‌ర్ కింగ్స్ ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్‌కు చేర‌కుండానే నిష్ర్క‌మించింది

PIC Credit : IPL

ఐదు సార్లు ఛాంపియ‌న్ అయిన చెన్నై సూప‌ర్ కింగ్స్ ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్‌కు చేర‌కుండానే నిష్ర్క‌మించింది. దీంతో సీఎస్‌కే అభిమానులు తీవ్ర నిరాశ‌కు గురి అయ్యారు. ఇక ధోనికి ఇదే లాస్ట్ సీజ‌న్ అని ప్ర‌చారం జ‌రిగినా ధోని రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌లేదు. అయితే.. వ‌చ్చే సీజ‌న్‌లో ధోని చూడ‌గ‌ల‌మో లేదో అని ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి. కాగా.. ధోని మ‌రికొన్నాళ్ల పాటు ఆడ‌తాడ‌ని సీఎస్‌కే మాజీ ఆట‌గాడు అంబ‌టి రాయుడు తెలిపారు. కానీ ఇందుకు బీసీసీఐ ఓ సాయం చేయాల్సి ఉంద‌న్నాడు. ఇప్పుడు అమ‌లు చేస్తున్న ఇంపాక్ట్ ప్లేయ‌ర్ రూల్‌ను మ‌రికొన్నాళ్ల పాటు కొన‌సాగించాల‌న్నాడు.

ధోని లాస్ట్ మ్యాచ్ ఆడేశాడ‌ని తాను అనుకోవ‌డం లేద‌ని రాయుడు చెప్పాడు. మ‌హి భాయ్ క్రికెట్ కు వీడ్కోలు ప‌ల‌క‌కూడ‌ద‌ని గ‌ట్టిగా కోరుకుంటున్న‌ట్లు చెప్పాడు. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ఆఖ‌రి ఓవ‌ర‌లో ధోని ఔట్ కావ‌డంతో కాస్త నిరుత్సాహానికి గురైన‌ట్లు వెల్ల‌డించాడు. అయితే.. గ‌తంలో ధోనిని ఇలా ఎప్పుడూ చూడ‌లేద‌న్నాడు.

KKR vs SRH : నో డౌట్‌.. హైద‌రాబాద్ పై కోల్‌క‌తా గెలుస్తుంది..

ఇక ధోని గురించి చాలా మందికి తెలియ‌ద‌న్నాడు. త‌ప్ప‌కుండా అత‌డు మ‌రో సీజ‌న్ ఆడ‌తాడ‌ని చెప్పుకొచ్చాడు. ఇంపాక్ట్ రూల్‌తో అత‌డి ఆట‌ను మ‌ళ్లీ చూసే అవ‌కాశం ఉంద‌న్నాడు. అందుక‌నే ఈ రూల్‌ను బీసీసీఐ కొన‌సాగించాల‌ని చెప్పాడు.

ఇదిలా ఉంటే.. ధోని మోకాలి గాయంతో బాధ‌ప‌డుత‌న్నాడు. చికిత్స కోసం లండ‌న్ వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. చికిత్స త‌రువాత‌నే త‌న భ‌విత‌వ్యంపై నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Junior Rohit Sharma : ఈ బుడ్డోడు జూనియ‌ర్ రోహిత్ శ‌ర్మ అట‌.. షాట్లు చూస్తే న‌మ్మ‌క త‌ప్ప‌దు?

ట్రెండింగ్ వార్తలు