Junior Rohit Sharma : ఈ బుడ్డోడు జూనియర్ రోహిత్ శర్మ అట.. షాట్లు చూస్తే నమ్మక తప్పదు?
టీమ్ఇండియా కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అలవోకగా సిక్సర్లు బాదేస్తుంటాడు.

Five year child hits sixes like Rohit Sharma video viral
టీమ్ఇండియా కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అలవోకగా సిక్సర్లు బాదేస్తుంటాడు. గ్రౌండ్ నలువైపులా చక్కటి షాట్లతో అలరిస్తుంటాడు. వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డులకు ఎక్కాడు. అతడికి బౌలింగ్ చేయాలంటే ఎలాంటి బౌలర్ అయినా సరే భయపడుతుంటాడు. అయితే.. ఓ చిన్నోడు అచ్చం రోహిత్ శర్మలా అలవోకగా భారీ సిక్సర్లు బాదేస్తున్నాడు.
ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 35 సెకన్ల ఈ వీడియోలో చిన్నారి చక్కగా ఆడుతున్నాడు. ఎలా బౌలింగ్ చేసినా సరే సిక్సర్లే లక్ష్యంగా బాదుతున్నాడు. ఇక్కడ ఓ విశేషం ఉందండోయ్.. ఆ చిన్నారి కూడా రోహిత్ శర్మ అభిమాని కావడం విశేషం. రోహిత్ పేరుతో ఉన్న ముంబై ఇండియన్స్ జెర్సీనే ధరించి ఆ చిన్నారి క్రికెట్ ఆడుతున్నాడు. ఈ వీడియో వైరల్‌గా మారగా.. జూనియర్ రోహిత్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు
ఇదిలా ఉంటే.. గత రెండు నెలలుగా రోహిత్ శర్మ ఐపీఎల్‌లో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్‌లో ముంబై ప్లేఆఫ్స్‌కు చేరలేదు. దీంతో టీ20 ప్రపంచకప్‌కు ముందు రోహిత్‌కు కాస్త విశ్రాంతి దొరికింది. జూన్ 1న అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. ఈపొట్టి ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా రెండు బృందాలుగా అమెరికా వెళ్లనుంది. తొలి విడుతలో కెప్టెన్ రోహిత్ శర్య, హార్థిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్ లతో పాటు సహాయక సిబ్బంది మార్చి 25న అమెరికా ప్లైట్ ఎక్కనున్నారు.
— john ki maa kaa bhosda (@DilSeRohit45) May 20, 2024