IPL 2024 qualifier1 : కోల్‌క‌తాతో మ్యాచ్‌కు ముందు స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్‌ పాట్ క‌మిన్స్ పోస్ట్ వైర‌ల్‌

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అంచ‌నాల‌ను మించి రాణిస్తోంది.

IPL 2024 qualifier1 : కోల్‌క‌తాతో మ్యాచ్‌కు ముందు స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్‌ పాట్ క‌మిన్స్ పోస్ట్ వైర‌ల్‌

Pat Cummins Instagram Post viral Ahead Of IPL 2024 Playoffs

Updated On : May 21, 2024 / 2:45 PM IST

IPL 2024 : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అంచ‌నాల‌ను మించి రాణిస్తోంది. ఎన్నో రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది. గ‌త మూడు నాలుగు సీజ‌న్లల‌లో అట్ట‌డుగు స్థానం కోసం పోటీప‌డ‌గా.. కొత్త కెప్టెన్ పాట్ క‌మిన్స్ సార‌థ్యంలో ఈ సీజ‌న్‌లో ఐపీఎల్ ఫైన‌ల్ పై గురి పెట్టింది. పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంతో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన హైద‌రాబాద్. మంగ‌ళ‌వారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌ర‌గ‌నున్న క్వాలిఫ‌య‌ర్ 1లో గెలిస్తే చాలు ద‌ర్జాగా ఫైన‌ల్‌లో అడుగుపెడుతోంది.

ఒక‌వేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన‌ప్ప‌టికీ కూడా మ‌రో అవ‌కాశం ఉంటుంది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన జ‌ట్టుతో క్వాలిఫ‌య‌ర్ 2లో త‌ల‌ప‌డ‌నుంది. ఆ మ్యాచ్‌లో గెలిచినా స‌రే ఫైన‌ల్‌కు చేరుకుంటుంది. ఈ క్ర‌మంలో ఎలాచూసుకున్నా కూడా ఎస్ఆర్‌హెచ్ ఫైన‌ల్ చేరుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉండ‌డంతో ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు.

Nita Ambani : ముంబై య‌జ‌మాని నీతా అంబానీ వ్యాఖ్య‌లు వైర‌ల్‌.. ఈ సీజ‌న్ పూర్తిగా నిరాశ‌ప‌రిచింది.. రోహిత్‌, హార్థిక్‌..

క‌మిన్స్ పోస్ట్ వైర‌ల్‌..

కాగా.. క్వాలిఫ‌య‌ర్ 1 మ్యాచ్‌కు ముందు స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ చేసిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఓడించింది. ఉప్ప‌ల్‌లో మ‌రో అద్భుత‌మైన రోజు. మాకు అండ‌గా నిలిచిన అభిమానుల‌కు ధ‌న్య‌వాదాలు. ఇక మ‌నం ఫైన‌ల్‌లో అడుగు పెట్ట‌డ‌మే మిగిలి ఉంది అంటూ క‌మిన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ సారి ఖ‌చ్చితంగా త‌న జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరుకుంటుంద‌ని క‌మిన్స్ ధీమాగా ఉన్నాడు.

కాగా.. క్వాలిఫ‌య‌ర్ 1 జ‌ర‌గ‌నున్న న‌రేంద్ర మోదీ స్డేడియంలో గ‌తేడాది జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను క‌మిన్స్ విజేత‌గా నిలిపిన విష‌యం తెలిసిందే.

Viral Video : అయ్యో బౌండ‌రీ ఇలా కొట్టాల‌ని తెలియక‌.. ఇన్నాళ్లు..!

 

View this post on Instagram

 

A post shared by Pat Cummins (@patcummins30)