Nita Ambani : ముంబై య‌జ‌మాని నీతా అంబానీ వ్యాఖ్య‌లు వైర‌ల్‌.. ఈ సీజ‌న్ పూర్తిగా నిరాశ‌ప‌రిచింది.. రోహిత్‌, హార్థిక్‌..

ఐపీఎల్ 17వ సీజ‌న్‌ ముంబై ఇండియ‌న్స్‌కు చేదు అనుభ‌వాన్ని మిగిల్చింది.

Nita Ambani : ముంబై య‌జ‌మాని నీతా అంబానీ వ్యాఖ్య‌లు వైర‌ల్‌.. ఈ సీజ‌న్ పూర్తిగా నిరాశ‌ప‌రిచింది.. రోహిత్‌, హార్థిక్‌..

screengrab from video posted on x by@Mumbai Indians

Mumbai Indians owner Nita Ambani : ఐపీఎల్ 17వ సీజ‌న్‌ ముంబై ఇండియ‌న్స్‌కు చేదు అనుభ‌వాన్ని మిగిల్చింది. 14 మ్యాచులు ఆడితే కేవ‌లం నాలుగు మ్యాచుల్లోనే గెలిచింది. మ‌రో 10 మ్యాచుల్లో ఓడిపోయింది. ఫ‌లితంగా పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్థానంతో టోర్నీని ముగించింది. ఈ సీజ‌న్‌కు ముందు జ‌ట్టుకు ఐదు సార్లు ట్రోఫీని అందించిన రోహిత్ శ‌ర్మ‌ను ముంబై సారథ్య బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించిన యాజ‌మాన్యం హార్దిక్‌కు కెప్టెన్సీని అప్ప‌గిచింది.

హార్దిక్ నాయ‌క‌త్వంలోనూ ముంబై దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. ఈ సీజ‌న్‌లో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్క‌మించిన మొద‌టి జ‌ట్టుగా అప‌ఖ్యాతిని మూట‌గ‌ట్టుకుంది. కాగా.. ఆఖ‌రి మ్యాచ్ ఆడిన త‌రువాత ముంబై ఇండియ‌న్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఆ జ‌ట్టు య‌జ‌మాని నీతా అంబానీ మాట్లాడుతూ.. ఈ సీజ‌న్ అంద‌రినీ నిరాశ‌ప‌రిచింద‌ని చెప్పింది. త‌ప్పు ఎక్క‌డ జ‌రిగిందో స‌మీక్షించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆమె అంగీక‌రించింది.

Gautam Gambhir : గౌత‌మ్ గంభీర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. సెల‌క్టర్ కాళ్లు ప‌ట్టుకోలేద‌ని జ‌ట్టులోకి ఎంపిక చేయ‌లేదు

ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియ‌న్స్ త‌మ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో.. మనందరికీ నిరాశాజనకమైన సీజన్ అని నీతా అంబానీ అంది. మ‌నం ఆశించిన విధంగా ఏదీ జ‌ర‌గ‌లేదంది. ఏదీ ఏమైన‌ప్ప‌టికీ కూడా తాను ముంబై ఇండియ‌న్స్‌కు వీరాభిమానిని అని చెప్పుకొచ్చింది. కేవ‌లం ఓ య‌జ‌మానిగా ఉండడంతో ఈ విష‌యం చెప్ప‌లేద‌ని తెలిపింది. ముంబై ఇండియన్స్ జెర్సీని ధరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, ఇక జ‌ట్టుతో ఇలా మ‌మేకం కావ‌డంతో త‌న‌కు ద‌క్కిన గౌవ‌రంగా భావిస్తున్న‌ట్లు తెలిపింది. ఆట‌తీరు, త‌ప్పు ఎక్క‌డ జ‌రిగింది అన్న విష‌యాల‌ను ఓ సారి స‌మీక్షించుకుందాం.. ఆ త‌రువాత ఏం చేయాల‌నే దాని గురించి ఆలోచిద్దాం అని నీతా అంబానీ అన్నారు.

ఇక టీమ్ఇండియా ఆట‌గాళ్లు అయిన రోహిత్ శ‌ర్మ‌, హార్దిక్ పాండ్య‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, జ‌స్‌ప్రీత్ బుమ్రాల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో అద‌ర‌గొట్టాల‌ని, క‌ప్పును తీసుకురావాల‌ని ఆకాంక్షించింది.

Viral Video : అయ్యో బౌండ‌రీ ఇలా కొట్టాల‌ని తెలియక‌.. ఇన్నాళ్లు..!