ఏపీ సీఎస్‌తో డీజీపీ సమావేశం.. ఈసీ ఇచ్చే కీలక ఆదేశాలపై చర్చ

ఏపీలో పోలింగ్ రోజున, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Post Poll Violence : ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా భేటీ ముగిసింది. ఏపీ సెక్రటేరియట్ లో సీఎస్, డీజీపీ సమావేశం అయ్యారు. పోలింగ్ రోజు, పోలింగ్ అనంతరం ఏపీలో జరిగిన అల్లర్లపై ఈసీకి నివేదిక పంపింది సిట్. ఈ క్రమంలో ఈసీ నుంచి ఆదేశాలు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై ఇద్దరూ చర్చించారు.

ఇంటెలిజెన్స్ ఏడీజీ విశ్వజిత్, లా అండ్ ఆర్డర్ ఏడీజీ బాగ్చి, సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈసీకి సమర్పించిన సిట్ నివేదికపై ప్రధానంగా చర్చించారు. ఇక ఈసీ నుంచి ఆదేశాలు వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనేదిపై వీరు డిస్కస్ చేశారు. దాదాపు గంట పాటు వీరి సమావేశం సాగింది.

ఎన్నికల కమిషన్ ఇచ్చే తదుపరి ఆదేశాలు ఏ విధంగా ఉంటాయి? సిట్ నివేదిక పరిశీలించాక ఈసీ వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది? అనేదానిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో పోలింగ్ రోజున, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాల కొందరు పోలీసు అధికారులు, ఐఏఎస్ లపై చర్యలు తీసుకుంది ఈసీ. పలువురిని బదిలీ చేసింది.

పోలింగ్ అనంతరం అల్లర్లపై సిట్ నివేదిక ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో అల్లర్లపై డీజీపీకి సిట్ నివేదిక అందక ముందే వైసీపీ, టీడీపీ పరస్పర ఫిర్యాదులు చేశాయి. హింసాత్మక ఘటనలకు మీరంటే మీరే కారణం అంటూ ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. చంద్రబాబు, పురంధేశ్వరి ఒత్తిళ్లతోనే అధికారులను ఈసీ మార్చిందని వైసీపీ ఆరోపించగా.. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఖండించింది.

అవసరమైతే తమ ఫోన్ డేటాను తీసుకోండి అంటూ టీడీపీ నేతలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇరు పక్షాల నేత కామెంట్స్ తో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. అసలు ఏపీలో అల్లర్లకు కారకులు ఎవరు? హింసాత్మక ఘటనల్లో ఎవరి పాత్ర ఎంత? సిట్ చేసిన నివేదికలో ఏముంది? అనేది హాట్ టాపిక్ గా మారింది.

Also Read : ఏపీలో సిట్ వేస్ట్.. జగన్, చంద్రబాబుకు బాధ్యత లేదా? : సీపీఐ నారాయణ

ట్రెండింగ్ వార్తలు