Naga Chaitanya : నాగచైతన్య కొత్త కారు భలే ఉందిగా.. ఈ లగ్జరీ స్పోర్ట్స్ మోడల్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ధర ఎంతంటే?

Naga Chaitanya : ఇప్పటికే చైతూ గ్యారేజ్‌లో పలు లగ్జరీ స్పోర్ట్స్ కార్లు ఉండగా, లేటెస్టుగా మరో కొత్త స్పోర్ట్స్ కారు వచ్చి చేరింది. అదే.. పోర్షే 911 GT3 RS మోడల్.

Naga Chaitanya adds brand new Porsche 911 GT3 RS Car ( Image Credit : Porsche Centre Chennai/Instagram )

Naga Chaitanya : టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కొత్త లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. ఇప్పటికే చైతూ గ్యారేజ్‌లో పలు లగ్జరీ స్పోర్ట్స్ కార్లు ఉండగా, లేటెస్టుగా మరో కొత్త స్పోర్ట్స్ కారు వచ్చి చేరింది. అదే.. పోర్షే 911 GT3 RS మోడల్. చైతూకి కార్లంటే చాలా ఇష్టం.. అందుకే మార్కెట్లోకి ఏదైనా కొత్త మోడల్ వచ్చిందంటే వెంటనే ఆ కారును కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటాడు.

ప్రస్తుతం చైతూ గ్యారేజీలో బ్లాక్ మెర్సిడెస్ బెంజ్ G63 AMG, రెడ్ కలర్ ఫెరారీ 488 GTBతో సహా అనేక మోడల్స్ విదేశీ కార్లు ఉన్నాయి. కొత్త పోర్షే 911 మోడల్ స్పోర్ట్స్ కారుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. స్టార్ హీరో చైతూకు తమ చెన్నైలోని పోర్షే సెంటర్ నుంచి కారును విజయవంతంగా డెలివరీ చేసినట్టు కంపెనీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కారుతో నాగచైతన్య ఫొటో దిగిన ఫొటోలను కూడా షేర్ చేసింది.

అక్కినేని నాగర్జునను పోర్షే కుటుంబానికి తిరిగి స్వాగతిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. కొత్త కారు 911 GT3 RS మోడల్ డెలివరీ చేసినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. కొత్త కారుతో ఆయన ప్రయాణం జీవితమంతా విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొంది.

పోర్షే 911 GT3 RS కారు ఖరీదు ఎంతంటే? :
నివేదిక ప్రకారం.. పోర్షే 911 GT3 RS కారు ధర రూ.3.50 కోట్లు (ఎక్స్-షోరూమ్) కలిగి ఉండగా, 7 స్పీడ్ DCT సాయంతో 518bhp, 468Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో నేచురల్ ఆస్పిరేటెడ్ 4 లీటర్ 6 సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. అంతేకాదు.. ఈ లగ్జరీ స్పోర్ట్స్ కారు గంటకు 296కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. నాగచైతన్య గ్యారేజీలో రూ.4కోట్ల (ఎక్స్-షోరూమ్) విలువైన బ్లాక్ మెర్సెడెస్‌ బెంజ్‌ G63 AMG పవర్‌ఫుల్‌ ఎస్‌యూవీ కారు ఉంది.

4.0-లీటర్ V8 ఇంజిన్‌తో పనిచేస్తుంది. 577బీహెచ్‌పీ వద్ద 480ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రూ.2.38 కోట్లతో ప్రారంభమయ్యే బ్లాక్ రేంజ్ రోవర్ వోగ్ (ఎక్స్-షోరూమ్), పోర్షే 911, ఫెరారీ 488GTB కార్లు ఉన్నాయి. ఇందులో ఈ కారు ధర రూ.4.88 కోట్లు ఉంటుంది. 3.9-లీటర్ ట్విన్-టర్బో వి8 ద్వారా పవర్ అందిస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ డీసీటీతో వస్తుంది.

నాగచైతన్య చివరిసారిగా హర్రర్ మిస్టరీ స్ట్రీమింగ్ సిరీస్ ధూత మూవీలో కనిపించాడు. ప్రస్తుతం దేశభక్తి యాక్షన్ మూవీ తాండల్‌లో నటిస్తున్నాడు. ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సాయి పల్లవి కూడా కీలక పాత్రలో నటిస్తోంది.

Read Also : Infinix GT 20 Pro 5G Launch : ఇన్ఫినిక్స్ జీటీ20 ప్రో 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ఈ ఫోన్ ధర, స్పెషిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే?

ట్రెండింగ్ వార్తలు