Post Office NSC Scheme : పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్.. కేవలం వడ్డీనే రూ.5 లక్షలకుపైగా సంపాదించవచ్చు.. పైగా జీరో రిస్క్..!
Post Office NSC Scheme : పోస్టాఫీస్ NSC పథకంలో రూ.11.50 లక్షలు పెట్టుబడి పెడితే ఐదేళ్లకు ఎంత వస్తుంది? 7.7శాతం వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం, పన్ను ప్రయోజనాలు, పెట్టుబడి నిబంధనలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Post Office NSC Scheme
- పోస్ట్ ఆఫీస్‌లో రూ.11.50 లక్షలు పెట్టుబడి
- NSCలో పెట్టుబడి పెడితే ఎంత వస్తుందో తెలుసా?
- ఐదేళ్లకు రూ.5 లక్షలకు పైగా వడ్డీ సంపాదించుకోవచ్చు
Post Office NSC Scheme : అందరికి సేవింగ్స్ చేయాలని ఉంటుంది. కానీ, కొందరే సేవింగ్ చేయగలరు.. పెట్టిన డబ్బు సేఫ్ ఉండటమే కాదు.. మంచి రాబడి కూడా రావాలని కోరుకుంటారు. అలాంటి వారి కోసం పోస్టాఫీస్ అద్భుమైన స్కీమ్ అందిస్తోంది.
అదే.. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) స్కీమ్.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ వడ్డీ సంపాదించుకోవాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా ఐదేళ్ల పాటు డబ్బును పక్కన పెట్టగలిగే వారికి ఈ పథకం అద్భుతంగా ఉంటుంది.
రూ.11.50 లక్షలు పెడితే ఎంత వస్తుంది? :
ప్రస్తుతం ఈ పథకానికి ఏడాదికి 7.7 శాతం వడ్డీ రేటు వర్తిస్తోందని తీసుకుంటే.. ఐదేళ్లలో చక్రవడ్డీతో పెట్టుబడి పెరుగుతుంది. ఉదాహరణకు.. ఒకేసారి రూ.11.50 లక్షలు పెట్టుబడి పెడితే, ఐదేళ్ల మెచ్యూరిటీకి సుమారు రూ.16.66 లక్షలు అందుతాయి. అంటే.. దాదాపు రూ.5.16 లక్షలు వడ్డీ రూపంలో లభిస్తాయి. అయితే, ఈ లెక్క ప్రస్తుత వడ్డీ రేటు ఐదేళ్లపాటు వర్తిస్తుందనే అంచనాపై ఆధారపడి ఉంటుంది.
రూ.1,000తోనూ మొదలుపెట్టండి :
NSC పథకంలో కనీసం రూ.1,000తో పెట్టుబడి ప్రారంభించవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C నిబంధనలకు అనుగుణంగా అర్హత ఉన్న పెట్టుబడులపై పన్ను ప్రయోజనం కూడా పొందే అవకాశం ఉంది. అయితే, దీనికి వర్తించే పన్ను విధానం, అర్హతలను ముందుగా తెలుసుకోవాలి.
పెట్టుబడికి ముందు ఇవి గుర్తుంచుకోండి :
ఈ పథకానికి ఐదేళ్ల మెచ్యూరిటీ టైమ్ ఉంటుంది. మధ్యలో అవసరమయ్యే డబ్బును ఇందులో పెట్టడం మంచిది కాదు. ముందుగానే ఖాతా క్లోజ్ చేయాలన్నా కొన్ని పరిమితులు ఉంటాయి. వడ్డీ రేట్లు ప్రభుత్వ సమీక్షకు లోబడి ఉంటాయి.
అందుకే పెట్టుబడి చేసే సమయంలో పోస్టాఫీస్‌లో లేటెస్ట్ వివరాలు తెలుసుకోవాలి. మొత్తానికి ఆర్థిక భద్రత కోసం ఐదేళ్ల పాటు పొదుపు చేయాలనుకునే వారికి NSC అద్భుతమైన స్కీమ్.. మీ అవసరాలు, పెట్టుబడి సామర్థ్యం, పన్ను పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు.
