PM Kisan 24th Installment : పీఎం కిసాన్ డబ్బులపై బిగ్ అప్డేట్.. ఈ 3 పనులు పూర్తి చేస్తేనే రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు..!
PM Kisan 24th Installment : పీఎం కిసాన్ 24వ విడత రూ.2వేలు ఎప్పుడు విడుదలవుతుంది? రైతులు ఈ-కేవైసీ, భూమి ధృవీకరణ, ఆధార్ లింకింగ్ వివరాలు ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం..
PM Kisan 24th Installment
- పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడొస్తాయ్?
- ఈ పని చేయకపోతే రూ. 2వేలు ఆగిపోవచ్చు
- 24వ విడతపై రైతుల ఎదురుచూపులు
PM Kisan 24th Installment Date : పీఎం కిసాన్ 24వ విడతకు సంబంధించి కీలక అప్డేట్.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 చొప్పున ఆర్థిక సాయం అందుతోంది. ప్రతి విడతలో రూ.2వేలు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
గత విడత జూన్ 20, 2026న రిలీజ్ అయితే, 24వ విడత డబ్బులు ఎప్పుడు క్రెడిట్ అవుతాయనే దానిపై కేంద్ర ప్రభుత్వం అధికారిక తేదీని ఇంకా ప్రకటించించలేదు. దీపావళికి ముందే డబ్బులు రావచ్చనే అంచనాలు వినిపిస్తున్నప్పటికీ, అధికారిక ప్రకటన వచ్చే వరకు రైతులు వేచి చూడాల్సిందే.
రూ.2వేలు రావాలంటే ఈ 3 పనులు తప్పనిసరి :
1. ఈ-కేవైసీ పూర్తి చేయండి :
మీ పీఎం కిసాన్ ఈ-కేవైసీ ఇంకా పెండింగ్‌లో ఉంటే వెంటనే పూర్తి చేయండి. ఈ ప్రక్రియ పూర్తికాకపోతే మీకు రావాల్సిన విడత డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉంది.
2. భూమి వివరాలు సరిచూసుకోండి :
పథకానికి సంబంధించిన భూమి రికార్డుల ధృవీకరణ పూర్తయిందో లేదో తెలుసుకోండి. ఏవైనా వివరాలు పెండింగ్‌లో ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి పూర్తి చేయండి.
3. ఆధార్‌తో బ్యాంకు ఖాతా లింక్ ఉందా? :
మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం, అవసరమైన బ్యాంకింగ్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మొబైల్ నంబర్ అందుబాటులో ఉంచుకుంటే స్టేటస్, మెసేజ్ తెలుసుకోవడం చాలా ఈజీ అవుతుంది.
మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందా? :
రైతులు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ (https://pmkisan.gov.in/)ను విజిట్ చేసి తమ బెనిఫిషియరీ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. ఈ-కేవైసీ, ల్యాండ్ వెరిఫికేషన్ లేదా ఇతర వివరాల్లో ఏదైనా సమస్య ఉంటే ముందుగానే గుర్తించి సరిచేసుకోవచ్చు.
Note : పీఎం కిసాన్ 24వ విడత విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.. ఈలోగా మీ వివరాలు సరిగా ఉన్నాయో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి..
