Infinix GT 20 Pro 5G Launch : ఇన్ఫినిక్స్ జీటీ20 ప్రో 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ఈ ఫోన్ ధర, స్పెషిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే?

Infinix GT 20 Pro 5G Launch : భారత మార్కెట్లో ఇన్ఫినిక్స్ జీటీ 20ప్రో ఫోన్ బేస్ 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ. 24,999 నుంచి ప్రారంభమవుతుంది. 12జీబీ+ 256జీబీ టాప్ మోడల్‌కు రూ. 26,999 చెల్లించాలి.

Infinix GT 20 Pro ( Image Credit : Google )

Infinix GT 20 Pro 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. ఈ కొత్త జీటీ20ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌తో జీటీ బుక్ సిరీస్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసింది. ఈ బ్రాండ్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌తో గేమ్‌లపై మరింత దృష్టి కేంద్రీకరించింది. క్లీన్, బ్లోట్‌వేర్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ ఆండ్రాయిడ్ 14 అవుట్ ది బాక్స్‌ను అందిస్తోంది. కంపెనీ ఇటీవలే దేశంలో నోట్ 40 ప్రో సిరీస్‌ను ప్రవేశపెట్టింది. మ్యాగ్‌సేఫ్ వంటి ఛార్జింగ్‌ సపోర్టుతో పాటు మిడ్ రేంజ్ ఫోన్ ఇప్పుడు జీటీ20 ప్రో అదే ధర, ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.

Read Also : KTM Duke Bike Colours : కొత్త కలర్ ఆప్షన్లతో కేటీఎమ్ డ్యూక్ బైక్ వచ్చేసిందోచ్.. అదిరే ఫీచర్లు.. ధర ఎంతంటే?

భారత్‌లో ఇన్పినిక్స్ జీటీ 20ప్రో ధర :
భారత మార్కెట్లో ఇన్ఫినిక్స్ జీటీ 20ప్రో ఫోన్ బేస్ 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ. 24,999 నుంచి ప్రారంభమవుతుంది. 12జీబీ+ 256జీబీ టాప్ మోడల్‌కు రూ. 26,999 చెల్లించాలి. తదుపరి తగ్గింపుల కోసం ఇతర బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. వచ్చే వారం నుంచి ఈ ఫోన్ దేశంలో అందుబాటులోకి రానుంది.

ఇన్ఫినిక్స్ జీటీ 20ప్రో స్పెసిఫికేషన్‌లు :
ఇన్పినిక్స్ ఫోన్ 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. జీటీ20 ప్రో ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ8200 అల్టిమేట్ చిప్‌సెట్ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. గరిష్టంగా 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీని ఉంటుంది. గేమర్‌ కోసం ప్రత్యేక లిక్విడ్ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఎక్స్ఓఎస్ వెర్షన్‌ను అందిస్తోంది.

ఇన్ఫినిక్స్ జీటీ ఫోన్ మరో 2 ఓఎస్ అప్‌డేట్‌లను అందించనుంది. మీరు మాక్రో, డెప్త్ సెన్సార్‌తో పాటు 108ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను పొందవచ్చు. ఈ 5జీ ఫోన్ 45డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్ స్పీడ్‌కు సపోర్టు ఇచ్చే 5000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. జేబీఎల్ ఆడియో ద్వారా ఆధారితమైన డ్యూయల్ స్పీకర్‌లను కలిగి ఉంది. ఈ ధర పరిధిలో జీటీ 20 ప్రో మార్కెట్లో నథింగ్ ఫోన్ 2ఎ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4, రెడ్‌మి నోట్ 13 ప్రో మోడళ్ల కన్నా తక్కువ ధరకే లభ్యం కానుంది.

Read Also : Reliance Jio Offers : రిలయన్స్ జియో అదిరే ఆఫర్.. ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లు ఈ ఓటీటీ కంటెంట్ ఫ్రీగా పొందొచ్చు..!

ట్రెండింగ్ వార్తలు