Khaidi : చిరంజీవిని స్టార్ హీరోగా చేసిన ‘ఖైదీ’.. నేటికి నలభై ఏళ్ళు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన మెగాస్టార్

చిరంజీవి హీరోగా, మాధవి(Madhavi), సుమలత(Sumalatha) హీరోయిన్స్ గా, కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ సినిమా 1983 అక్టోబర్ 28న రిలీజయింది.

Megastar Chiranjeevi emotional Post on Khaidi Completing 40 Years

Khaidi Movie : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గురించి అందరికి తెలిసిందే. సినీ పరిశ్రమకు సింగిల్ గా వచ్చి కెరీర్ ఆరంభంలో ఎంతో కష్టపడి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, సెకండ్ హీరోగా పలు సినిమాలు చేసి హీరోగా ఎదిగారు. అనంతరం స్టార్ హీరో అయి మెగాస్టార్ గా మారి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే చిరంజీవిని స్టార్ హీరోగా నిలబెట్టింది మాత్రం ఖైదీ సినిమానే.

చిరంజీవి హీరోగా, మాధవి(Madhavi), సుమలత(Sumalatha) హీరోయిన్స్ గా, కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ సినిమా 1983 అక్టోబర్ 28న రిలీజయింది. అప్పట్లో 50 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 8 కోట్ల వరకు కలెక్షన్స్ తీసుకొచ్చి భారీ విజయం సాధించి ఫుల్ గా లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా చిరంజీవిని స్టార్ హీరోగా నిలబెట్టింది. ఈ సినిమాలో చిరంజీవికి ఇచ్చిన హీరో ఎలివేషన్స్ ఇప్పటికి ఆయన అభిమానులకు గుర్తుండిపోతాయి. ఈ సినిమాలోని సాంగ్స్ కూడా అన్ని హిట్ అయ్యాయి.

Also Read : Pawan Kalyan : వరుణ్ లావణ్య పెళ్ళికి.. భార్యతో సహా ఇటలీకి బయలుదేరిన పవన్..

ఈ సినిమా వచ్చి 40 ఏళ్ళు అవ్వడంతో మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ లో ఖైదీ పోస్టర్స్ షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. చిరంజీవి.. ‘ఖైదీ’ చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ‘ఖైదీ’ని చేసింది. నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం. ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది. ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒక సారి ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, ఆ చిత్ర దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి గారిని, నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్ ని, రచయితలు పరుచూరి సోదరులను, నా కో- స్టార్స్ సుమలత, మాధవిలని మొత్తం టీమ్ ని అభినందిస్తూ అంత గొప్ప విజయాన్ని మాకందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు అని పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు