Berlin : ‘మనీ హైస్ట్’ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘బెర్లిన్’ వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ అనౌన్స్..

బెర్లిన్ క్యారెక్టర్ కి ఉన్న బ్యాక్ స్టోరీ ఆల్రెడీ కొంచెం మనీహైస్ట్ లో చూపించారు. ఇప్పుడు బెర్లిన్ క్యారెక్టర్ తో సపరేట్ సిరీస్ రాబోతుంది. ఇటీవల కొన్ని రోజుల క్రితం బెర్లిన్ సిరీస్ నుంచి ప్రోమో రిలీజ్ కాగా తాజాగా ఈ సిరీస్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది నెట్‌ఫ్లిక్స్.

Money Heist famous character Berlin Series Releasing date announced by Netflix

Berlin Series : 2017లో ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్(Netflix) లో మొదలైన మనీహైస్ట్(Money Heist) సిరీస్ 2021 వరకు మూడు సీజన్స్ తో 40 ఎపిసోడ్స్ గా సాగింది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లా బ్యాంకులను దోచుకునే కాన్సెప్ట్ తో మనీహైస్ట్ ని తెరకెక్కించారు ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. ఇక ఇండియాలో అయితే ఈ సిరీస్ తో నెట్‌ఫ్లిక్స్ బిజినెస్ కూడా పెరిగింది.

ఇండియాలో మనీహైస్ట్ సిరీస్ కి ఎంత డిమాండ్ వచ్చింది అంటే ఏకంగా నెట్‌ఫ్లిక్స్ ఇక్కడ ఇండియాలో లోకల్ లాంగ్వేజెస్ లో లాస్ట్ సీజన్ ని రిలీజ్ చేయడమే కాక, ఇక్కడ కూడా ప్రమోషన్స్ చేశారు. అయితే ఈ సిరీస్ లో ఒక్కో క్యారెక్టర్ కి ఒక్కో బ్యాకెండ్ స్టోరీ ఉంటుంది. వాటిపై సిరీస్ లు వచ్చే అవకాశం ఉందని గతంలో ప్రకటించారు. ఈ సిరీస్ లో మెయిన్ క్యారెక్టర్స్ లో ఒకటి ప్రొఫెసర్ కి బ్రదర్, మనీహైస్ట్ టీంకి సెకండ్ కమాండర్ బెర్లిన్. ఈ క్యారెక్టర్ ని పెడ్రో అలోన్సో చేశారు. అన్ని క్యారెక్టర్స్ తో పాటే ఈ క్యారెక్టర్ కూడా బాగా హిట్ అయింది.

బెర్లిన్ క్యారెక్టర్ కి ఉన్న బ్యాక్ స్టోరీ ఆల్రెడీ కొంచెం మనీహైస్ట్ లో చూపించారు. ఇప్పుడు బెర్లిన్ క్యారెక్టర్ తో సపరేట్ సిరీస్ రాబోతుంది. ఇటీవల కొన్ని రోజుల క్రితం బెర్లిన్ సిరీస్ నుంచి ప్రోమో రిలీజ్ కాగా తాజాగా ఈ సిరీస్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది నెట్‌ఫ్లిక్స్. బెర్లిన్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో డిసెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. దీంతో మనీ హైస్ట్ ఫ్యాన్స్ ఈ సిరీస్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రొఫెసర్ కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

Siri Hanumanthu : జవాన్ ఛాన్స్ వచ్చినప్పుడు ఫేక్ కాల్ అనుకున్నా.. అట్లీ బాగా తిట్టడంతో ఏడ్చేశా..

ఇక మనీ హైస్ట్ లో బెర్లిన్ వజ్రాభరణాలు కొట్టేయడంలో స్పెషలిస్ట్ అని చూపించారు. ఇప్పుడు బెర్లిన్ సిరీస్ లో అదే చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ లో పారిస్ లో ఉన్న అతిపెద్ద వేలం వేసే సంస్థలో ఉండే ఆభరణాలు బెర్లిన్ కొట్టేయబోతున్నట్టు చూపించారు. నెట్‌ఫ్లిక్స్ కి బెర్లిన్ సిరీస్ తో మరింత ఆదరణ కచ్చితంగా వస్తుంది. మరి ఈ సిరీస్ ని ఇండియాలో లోకల్ లాంగ్వేజీలలో వస్తుందా చూడాలి.

ట్రెండింగ్ వార్తలు