Pranayagodari Glimpse : కమెడియన్ అలీ సోదరుని తనయుడు సదన్ హీరోగా ప్రణయగోదారి సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా PL విఘ్నేష్ దర్శకత్వంలో పిఎల్వి క్రియేషన్స్ బ్యానర్ పై పారమళ్ళ లింగయ్య నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సునీల్ రావినూతల, 30 ఇయర్స్ పృథ్వీ, సాయి కుమార్.. పలువురు నటీనటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : Sitara Ghattamaneni : బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్న సితార.. నమ్రతా పోస్ట్ చూశారా..?
ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్స్, ఓ సాంగ్ రిలీజవ్వగా తాజాగా ప్రణయగోదారి నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఓ పక్క గోదారి గట్టు మీద ప్రేమ జంట రొమాంటిక్ సన్నివేశాలు, మరో పక్క సీరియస్ యాక్షన్ సీన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. పెదకాపు పాత్రలో సాయి కుమార్ మాస్ డైలాగ్స్ చెప్పి అదరగొట్టారు. మీరు కూడా గ్లింప్స్ చూసేయండి..
ఈ గ్లింప్స్ రిలీజ్ అనంతరం నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ… ప్రణయగోదారి గ్లింప్స్ చాలా బాగుంది. సాయి కుమార్ డైలాగ్స్ ఈ సినిమాలో అదిరిపోతాయని తెలుస్తుంది. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.