SSMB28: మహేష్ మూవీలో మలయాళ నటుడు.. ఎవరంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోయే సినిమా కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో మనకు తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది.

SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోయే సినిమా కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో మనకు తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాతో మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ కచ్చితంగా హ్యాట్రిక్ హిట్ అందుకుంటుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

SSMB28 Shooting: మొదలెట్టేందుకు సిద్ధం అంటోన్న మహేష్.. ఎప్పుడంటే?

అయితే మహేష్ కెరీర్‌లో 28వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ మలయాళ నటుడు జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటుడు రోషన్ మాథ్యూ త్వరలోనే తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

SSMB 28 : మహేష్ త్రివిక్రమ్ సినిమాలో ఒకప్పటి లవర్ బాయ్.. నిజమేనా?

కాగా, త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రోషన్ మాథ్యూ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోయే సినిమానే అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో రోషన్ చేయబోయేది ఓ నెగెటివ్ రోల్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో రోషన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మరి మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో రోషన్ మాథ్యూ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు