NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘NTR30’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు కొరటాల తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను చిత్ర యూనిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అందుకే ఈ సినిమా కోసం జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను చివరిదశకు తీసుకొచ్చిన చిత్ర యూనిట్, ఇక త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధం అవుతోంది.
NTR30: “NTR30” ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌లో వేగం పెంచిన కొరటాల..
ఇటీవల ఈ చిత్ర ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ రత్నవేలులను దర్శకుడు కొరటాల కలిసి, ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను వారితో షేర్ చేసుకున్నారు. ఇందులో భాగంగా ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టేందుకు కొన్ని అద్భుతమైన లొకేషన్స్ కావాలని కొరటాల కోరాడట. ఇప్పుడు ఇదే పనిపై వారిద్దరు లొకేషన్ వేటలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సాబు సిరిల్, రత్నవేలు ప్రస్తుతం గోవాలో లొకేషన్ వేటలో ఉన్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
NTR30: మెడికల్ మాఫియా కథాంశంతో ఎన్టీఆర్ కొరటాల సినిమా..
ఇక ఈ సినిమా కోసం తారక్ మరోసారి తన ఫిజిక్, లుక్‌ను మార్చుకోనుండగా, ఈ సినిమా నుండి త్వరలోనే ఓ అదిరిపోయే అప్డేట్ అయితే ఇచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్ లేదా, ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ గురించి ఈ అప్డేట్ అయ్యి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. మరి ఎన్టీఆర్ సినిమాను ఏయే ప్రదేశాల్లో చిత్రీకరిస్తారో చూడాలి. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.