Lavu Sri Krishna Devarayalu
AP Election 2024 : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడులో పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలుపై రాళ్లదాడి జరిగింది. పోలింగ్ కేంద్రం వద్దకు రావటానికి వీలులేదని వైసీపీ వర్గీయులు వారించగా.. వచ్చే హక్కు ఉందని ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ చెప్పారు. దీంతో కొద్దిసేపు పోలింగ్ కేంద్రం వద్ద ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో శ్రీకృష్ణ దేవరాయలు కాన్వాయ్ పై వైసీపీ శ్రేణులు రాళ్లదాడి చేశారు. రాళ్ల దాడిలో మూడు కార్లు ధ్వంసం అయ్యాయి.
Alsol Read : Allu Arjun : నంద్యాల టూర్‌పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్.. పవన్ గురించి ఏమన్నారంటే?
లావు శ్రీకృష్ణ దేవరాయలు మీడియాతో మాట్లాడుతూ.. నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థులను కేంద్రాల వద్దకు రానివ్వకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకోవడం దారుణం అన్నారు. దొండపాడు పోలింగ్ కేంద్రం సమస్యాత్మక కేంద్రంగా ముందే చెప్పాం. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు టీడీపీ అభ్యర్థులకు సహకరించడం లేదు. వైసీపీ శ్రేణుల ఆగడాలకు పోలీసులు పూర్తి మద్దతు ఇస్తున్నారు.
Also Read : అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత.. ఈవీఎంలు ధ్వంసం
దొండపాడులో జరిగిన ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. దొండపాడు పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్లను వైసీపీ శ్రేణులు బయటకు నెట్టారు. దొండపాడులో రీ పోలింగ్ జరగాలి. రీపోలింగ్ జరపాలంటూ ఎలక్షన్ కమిషన్ ను కోరతామని లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు.