అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత.. ఈవీఎంలు ధ్వంసం

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఉధ్రిక్తత నెలకొంది. పుల్లంపేట మండలం దళావాయిపల్లిలో ఈవీఎంలను ద్వంసం చేశారు.

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత.. ఈవీఎంలు ధ్వంసం

Railwaykodur constituency

Updated On : May 13, 2024 / 11:20 AM IST

AP Election 2024 : అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఉధ్రిక్తత నెలకొంది. పుల్లంపేట మండలం దళావాయిపల్లిలో జనసేన ఏజెంట్ రాజారెడ్డి కిడ్నాప్ వ్యవహారం కలకలం సృష్టించింది. ఇందుకు నిరసనగా గ్రామస్తులు ఆగ్రహంతో ఈవీఎంలను పగలగొట్టారు. దీంతో 192 పోలింగ్ బూత్ లో పోలింగ్ నిలిచిపోయింది. పోలింగ్ ప్రక్రియ పునరుద్దరించడానికి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. కొత్త ఈవీఎంలను పోలింగ్ కేంద్రానికి తరలించారు.

Also Read : Allu Arjun : నంద్యాల టూర్‌పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్.. పవన్ గురించి ఏమన్నారంటే?

పోలింగ్ కేంద్రం వద్దకు బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు చేరుకొని పీఓతో వాగ్వాదంకు దిగారు. జనసేన ఏజెంట్ లు లేకుండా పోలింగ్ ఎలా నిర్వహిస్తారని పీవోతో కూటమి నేతలు వాగ్వాదానికి దిగారు. పోలింగ్ కేంద్రంను అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ సందర్శించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆదేశాలిచ్చారు.

Also Read : KA Paul: ఇంట్లో నిద్రపోకండి.. బయటికి వచ్చి ఓటు వేయండి: కేఏ పాల్

కడప జిల్లాలో..
కడప జిల్లా మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రమోహన్ మాట్లాడుతూ.. చాపాడు మండలం చిన్న గురువలూరు పోలింగ్ స్టేషన్లో ఉదయం టీడీపీ ఏజెంట్ల పై దాడి చేశారని, సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నామని చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఓటర్లు ప్రశాంతంగా ఓటు వేసుకోవాలని, పోలింగ్ కు ఆటంకాలు సృష్టిస్తే కేసులను నమోదు చేసి చర్యలు చేపడతామని అన్నారు.