Virat Kohli : సింహంతో ప‌రాచ‌కాలా..! మ‌న‌కెందుకు ఇషాంత్‌..! చూడు ఇప్పుడు ఏమైందో..?

ఈ మ్యాచ్‌లో ఇషాంత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిల మ‌ధ్య‌ ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది.

PIC Credit : IPL

Virat Kohli – Ishant Sharma : మిణుకుమిణుకు మంటున్న ప్లే ఆఫ్స్ ఆశ‌ల‌ను రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు స‌జీవంగా ఉంచుకుంది. ఆదివారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 47 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. దీంతో పాయింట్ల ప‌ట్టిక‌లో ఆర్‌సీబీ ఐదో స్థానానికి ఎగ‌బాకింది. ఈ మ్యాచ్‌లో ఇషాంత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిల మ‌ధ్య‌ ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఈ మ్యాచ్‌లో బెంగ‌ళూరు జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది. ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి 13 బంతులు ఎదుర్కొన్నాడు. 1 ఫోర్‌, 3 సిక్స‌ర్లు బాది 27 ప‌రుగులు చేశాడు. కాగా.. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ నాలుగో ఓవ‌ర్‌లో కోహ్లి-ఇషాంత్‌కు మ‌ధ్య చిన్న‌పాటి టీజింగ్ జ‌రిగింది.

KKR : ఈ సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జ‌ట్టుగా కోల్‌క‌తా.. షాకిచ్చిన బీసీసీఐ

నాలుగో ఓవ‌ర్ ను ఇషాంత్ శ‌ర్మ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని మొద‌టి బంతికి విరాట్ కోహ్లి ఫోర్ కొట్టాడు. ఆ త‌రువాత ఇషాంత్‌తో స్లిప్‌లో ఫీల్డ‌ర్ పెట్టూ ఆట‌ప‌ట్టించాడు. ఆ త‌రువాతి బంతిని సిక్స్ బాదాడు. మ‌రోసారి కోహ్లి ఏదో అనగా ఇషాంత్ కామ్‌గానే ఉన్నాడు. మూడో బంతి మిస్ కాగా.. నాలుగో బంతిని భారీ షాట్ ఆడేందుకు య‌త్నించగా బ్యాట్ ఎడ్జ్‌ను తీసుకున్న బంతి వికెట్ కీప‌ర్ చేతుల్లో ప‌డింది. దీంతో కోహ్లి ఔట్ అయ్యాడు.

త‌న వంతు రావ‌డంతో ఇషాంత్ ఆనందంతో ఎగిరి గంతులేశాడు. ఆ త‌రువాత కోహ్లి వ‌ద్ద‌కు వ‌చ్చి న‌డుముతో అత‌డిని వెన‌క్కి నెడుతూ వెళ్లు ఇక వెళ్లు అన్న‌ట్లుగా సింబాలిక్‌గా చెప్ప‌గా.. కోహ్లి న‌వ్వుతూ మైదానాన్ని వీడాడు.

అనంత‌రం లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. కాగా.. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ప‌దో నంబ‌ర్ స్థానంలో ఇషాంత్ శ‌ర్మ బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. ఆ స‌మ‌యంలో అత‌డి వ‌ద్ద‌కు వెళ్లిన‌ కోహ్లి.. ఇక చాల్లే ప‌ద ప‌ద అంటూ ఆట‌ప‌ట్టించాడు. ఇషాంత్ నాలుగు బంతులు ఎదుర్కొని ప‌రుగులు ఏమీ చేయ‌కుండా అజేయంగా ఉన్నాడు. కాగా.. ఇషాంత్, కోహ్లిల‌కు సంబంధించిన టీజింగ్ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Hardhik Pandya : వ‌రుస ఓట‌ముల‌పై హార్దిక్ పాండ్య వ్యాఖ్య‌లు వైర‌ల్‌..

విరాట్ కోహ్లి, ఇషాంత్ శ‌ర్మ‌లు దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వ‌హించారు. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహం ఉంది. టీమ్ఇండియాలో కోహ్లి కెప్టెన్సీలో ఇషాంత్ ఆడాడు. ఈ క్ర‌మంలోనే ఇలా ఒక‌రినొక‌రు స‌ర‌దాగా టీజ్ చేసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు