Oke Oka Jeevitham: తన సినిమా టికెట్లు తనకే దొరకలేదని అంటోన్న ‘ఒకే ఒక జీవితం’ డైరెక్టర్!

యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఒకే ఒక జీవితం’ గత శుక్రవారం రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకార్తిక్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. అయితే ఈ చిత్ర దర్శకుడు శ్రీకార్తిక్‌కు తాజాగా ఓ విచిత్ర ఘటన ఎదురయ్యింది.

Oke Oka Jeevitham: యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఒకే ఒక జీవితం’ గత శుక్రవారం రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకార్తిక్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. అమ్మ సెంటిమెంట్‌తో వచ్చిన ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతుండటంతో ఈ సినిమా చాలా ఏరియాల్లో హౌజ్‌ఫుల్ షోలతో దూసుకెళ్తోంది. అయితే ఈ చిత్ర దర్శకుడు శ్రీకార్తిక్‌కు తాజాగా ఓ విచిత్ర ఘటన ఎదురయ్యింది.

Oke Oka Jeevitham: సెన్సార్ పనులు ముగించుకున్న ఒకే ఒక జీవితం

‘ఒకే ఒక జీవితం’ సినిమాకు పబ్లిక్ మౌత్ టాక్ పాజిటివ్‌గా ఉండటంతో ఈ సినిమాకు హౌజ్‌ఫుల్ బోర్డులు పడుతున్నాయనే విషయం తెలుసుకున్న ఈ చిత్ర డైరెక్టర్ శ్రీకార్తిక్.. సినిమా రిలీజ్ అయిన మూడో రోజున ఈ సినిమాను చూసేందుకు ఓ థియేటర్‌కు వెళ్లాడు. అయితే అతడికి టికెట్ బుకింగ్ కౌంటర్లో ‘నో టికెట్స్’ అనే రెస్పాన్స్ దక్కడంతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు ఈ డైరెక్టర్. తన సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ దక్కడం చాలా హ్యాపీగా ఉందని ఈ డైరెక్టర్ అంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Hero Sharwanand Speech At Oke Oka Jeevitham Pre Release Event

ఎమోషనల్ కంటెంట్‌కు టైమ్ ట్రావెల్ వంటి సైన్స్ ఫిక్షన్ అంశాన్ని జోడించి ఈ సినిమాను శ్రీకార్తిక్ మలిచిన తీరు చాలా బాగుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ సినిమాతో శర్వానంద్ ఎంతగానో వెయిట్ చేస్తున్న హిట్ అందుకున్నాడు. ఈ మూవీలో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రీతూ వర్మలు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా, శర్వా తల్లిగా నటి అమల అక్కినేని చాలా గ్యాప్ తరువాత మళ్లీ సినిమాల్లో కనిపించడం ఆమె అభిమానులకు సంతోషాన్ని కలిగించింది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, డ్రీమ్స్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు