Pawan kalyan : మొదటి భార్యకి 5 కోట్లు ఇచ్చాను, రెండో భార్యకి ఆస్తి ఇచ్చాను.. మూడు పెళ్లిళ్లపై స్పందించిన పవన్..

మంగళగిరి ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ తన పెళ్లిళ్ల గురించి మాట్లాడిన వాళ్లకి కౌంటర్ ఇస్తూ.. ''మాట్లాడితే నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను అంటారు. కావాలంటే మీరు కూడా చేసుకోండి. నేను భారత రాజ్యాంగ ప్రకారం అధికారికంగా విడాకులు...................

Pawan kalyan :  వైజాగ్ లో పవన్ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అడ్డుకోవడంతో పవన్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల నుంచి పవన్ వైసీపీ నేతలపై, ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం జనసేన మంగళగిరి ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నాయకులపై తీవ్ర పదజాలంతో రెచ్చిపోయారు. ఈ సందర్భంగా కొంతమంది వైసీపీ నేతలు తన పెళ్లిళ్ల గురించి పదే పదే మాట్లాడటాన్ని గుర్తు చేస్తూ దానికి గట్టిగా సమాధానమిచ్చారు పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ 1997లో వైజాగ్ కి చెందిన నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. 2007లో అధికారికంగా విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత 2009లో రేణూ దేశాయ్ ని పెళ్లి చేసుకున్నారు. 2012లో రేణు దేశాయ్ తో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2013లో అన్నా లెజినోవాని పెళ్లి చేసుకున్నారు.

RRR : ఫ్యామిలీలతో కలిసి జపాన్ చెక్కేసిన ఎన్టీఆర్, చరణ్.. అక్కడ కూడా హిట్ కొట్టడానికి రెడీ..

మంగళగిరి ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ తన పెళ్లిళ్ల గురించి మాట్లాడిన వాళ్లకి కౌంటర్ ఇస్తూ.. ”మాట్లాడితే నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను అంటారు. కావాలంటే మీరు కూడా చేసుకోండి. నేను భారత రాజ్యాంగ ప్రకారం అధికారికంగా విడాకులు ఇచ్చి వేరే పెళ్లిళ్లు చేసుకున్నాను. మొదటి భార్యకు విడిపోయినప్పుడు రూ. 5 కోట్ల డబ్బులు ఇచ్చాను. రెండో భార్యకు కొంచెం ఆస్తి ఇచ్చాను. ఇవన్నీ మీకు తెలీవు. వారితో నాకు వర్క్ అవుట్ కాలేదు కాబట్టి అధికారికంగానే విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నాను. అంతేకాని నేను మీలాగా ఒక్క పెళ్లి చేసుకొని 30 స్టెప్నిలతో తిరగట్లేదు. మీలాంటి వాళ్ళు నన్ను విమర్శిస్తారా” అంటూ ఫైర్ అయ్యారు. దీంతో పవన్ ఇచ్చిన విడాకుల భరణం గురించి చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు