Pawan Kalyan OG : సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ OG ? పండక్కి వస్తాడా?

OG సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారని మాత్రం ప్రకటించలేదు. ఇంకా పవన్ కళ్యాణ్ ఒక షెడ్యూల్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది.

Pawan Kalyan They Call Him OG Movie Planning to Release on Sankranthi

Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎలక్షన్స్ కి కొన్ని నెలల ముందే OG సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్స్ పూర్తి చేయాలని ట్రై చేస్తున్నారు. పవన్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాల్లో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో DVV దానయ్య నిర్మాణంలో They Call him OG సినిమా భారీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా, తమిళ నటుడు అర్జున్ దాస్, నటి శ్రియా రెడ్డి, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తాడని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కోసం పవన్ మార్షల్ ఆర్ట్స్ చేసిన ఫోటోలు లీక్ అవ్వడంతో పాటు రిలీజ్ చేసిన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. నిన్న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా OG సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా ఇది సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. ఈ గ్లింప్స్ చూస్తుంటే భాషా సినిమా రేంజ్ లో ఒక పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ కథలా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. దీంతో పవన్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అయితే OG సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారని మాత్రం ప్రకటించలేదు. ఇంకా పవన్ కళ్యాణ్ ఒక షెడ్యూల్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో ఉన్నాడు. అది అయ్యాక OG కి డేట్స్ ఇస్తాడు. దసరా లోపు షూటింగ్ పూర్తిచేసి తర్వాత ఫాస్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తిచేసి సంక్రాంతికి OG సినిమాని రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్.

Bigg Boss Maanas : నిశ్చితార్థం చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్, సీరియల్ నటుడు మానస్.. ఎంగేజ్మెంట్ ఫొటోలు..

కానీ ఇప్పటికే సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉన్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ, రవితేజ ఈగల్, విజయ్ దేవరకొండ సినిమా, తేజ సజ్జ హనుమాన్ సినిమా, ప్రభాస్ కల్కి సినిమాలు సంక్రాంతికి అనౌన్స్ చేశారు. కానీ వీటిలో ప్రభాస్ కల్కి, విజయ్ దేవరకొండ, రవితేజ ఈగల్ సినిమాలు అయితే కచ్చితంగా వాయిదా పడతాయి. మరి ఈ సంక్రాంతి బరిలో మహేష్, నాగార్జునలతో పాటు పవన్ కళ్యాణ్ కూడా OG సినిమాతో బరిలోకి దిగుతాడా చూడాలి. OG కూడా సంక్రాంతికి వస్తే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం.

 

ట్రెండింగ్ వార్తలు