Pushpa 2 Movie Opening : అల్లు అర్జున్ లేకుండానే మొదలుపెట్టేసిన సుక్కూ.. పుష్ప 2 పూజా కార్యక్రమం..

తాజాగా నేడు సోమవారం ఉదయం పుష్ప 2 పూజా కార్యక్రమాలు నిర్వహించారు చిత్ర యూనిట్. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం అమెరికాలో ఉండటంతో ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దీంతో అల్లు అర్జున్ లేకుండానే పుష్ప 2 ఓపెనింగ్ జరిగింది. అయితే................

Pushpa 2 Movie Opening :  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ ని ఐకాన్ స్టార్ గా మార్చేసి కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది పుష్ప సినిమా. దేశమంతటా పుష్ప మానియా కనిపించింది. ఇక విదేశాల్లో కూడా పుష్ప సాంగ్స్, తగ్గేదేలే అంటూ బన్నీ మేనరిజం, డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఈ సినిమాకి పార్ట్ 2 ఉంటుందని గతంలోనే ప్రకటించారు. అయితే పుష్ప సినిమా వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇంకా పార్ట్ 2 మొదలుపెట్టలేదని బన్నీ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. తాజాగా చిత్ర యూనిట్ బన్నీ ఫ్యాన్స్ లో జోష్ నింపింది.

Allu Arjun : న్యూయార్క్ మేయర్‌తో తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్.. అమెరికాలో బన్నీ సందడి..

పుష్ప పాన్ ఇండియా లెవెల్ లో భారీ విజయం సాధించడంతో పుష్ప 2లో సుకుమార్ భారీ మార్పులు చేసినట్టు తెలుస్తుంది. మరింత భారీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్. తాజాగా నేడు సోమవారం ఉదయం పుష్ప 2 పూజా కార్యక్రమాలు నిర్వహించారు చిత్ర యూనిట్. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం అమెరికాలో ఉండటంతో ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దీంతో అల్లు అర్జున్ లేకుండానే పుష్ప 2 ఓపెనింగ్ జరిగింది. అయితే బన్నీ కూడా ఉంటే బాగుండు అని అభిమానులు అనుకుంటున్నారు. పుష్ప 2 షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టనున్నారు అని తెలియడంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పుష్ప 2 పూజా కార్యక్రమానికి చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు