Rathika : నాలుగు వారాలకు ర‌తిక ఎంత సంపాదించిందో తెలుసా..?

బిగ్‌బాస్ (Bigg Boss) తెలుగు సీజ‌న్ 7లో నాలుగు వారాలు ముగిశాయి. న‌లుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు.

Rathika Rose Remuneration

Rathika Rose Remuneration : బిగ్‌బాస్ (Bigg Boss) తెలుగు సీజ‌న్ 7లో నాలుగు వారాలు విజ‌య‌వంతంగా ముగిశాయి. న‌లుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. 14 మంది కంటెస్టెంట్ల‌తో షో ప్రారంభం కాగా.. మొద‌టి వారంలో కిర‌ణ్ రాథోడ్‌, రెండో వారంలో ష‌కీలా, మూడో వారంలో సింగ‌ర్ దామిని, నాలుగో వారంలో ర‌తిక (Rathika) లు హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. దీంతో ప్ర‌స్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో 10 మంది కంటెస్టెంట్లు మాత్ర‌మే ఉన్నారు. ఎలిమినేట్ కావ‌డంతో ర‌తిక క‌న్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఎలిమినేట్ కావ‌డం చాలా మందికి ఓ షాక్ గానే చెప్ప‌వ‌చ్చు.

ల‌వ్ ట్రాక్స్‌..

బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన రెండురోజుల్లోనే రైతుబిడ్డ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌తో క్లోజైంది ర‌తిక. వీరిద్ద‌రు ప్రేమ ప‌క్షులు అని ప్రేక్ష‌కులు ఫిక్సైయ్యేలోగా రెండో వారంలో సీన్ బెడిసికొట్టింది. ప్ర‌శాంత్‌తో పాటు ప్రిన్స్ యావ‌ర్‌ల‌తో క్లోజ్‌గా ఉంటూనే వాళ్ల‌ను వెన్నుపోటు పొడిచింది. ఇది ఆమె గేమ్‌ ప్లాన్‌లో భాగ‌మై ఉండొచ్చు గానీ, ఆడియ‌న్స్ కు ఈ విష‌యంలోనే ఆమె పై వ్య‌తిరేక‌త ఏర్ప‌డింది. దీంతో ఆమెకు త‌క్కువ‌గా ఓట్లు వ‌చ్చాయి.

రెమ్యున‌రేష‌న్ ఎంతంటే..?

బిగ్‌బాస్‌లో నాలుగు వారాలు మాత్ర‌మే ఉన్న‌ప్ప‌టికీ రతిక‌ గ‌ట్టిగానే సంపాదించింది అని అంటున్నారు. ఆమె వారానికి రెండు ల‌క్ష‌ల చొప్పున అగ్రిమెంట్ చేసుకుంద‌ని టాక్‌. ఈ లెక్క‌న నాలుగు వారాల‌కు రూ.8ల‌క్ష‌లు అందుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. టైటిల్ ఫేవ‌రెట్ అనుకున్న ఈ హాట్ బ్యూటీ ఇంత త్వ‌ర‌గా ఎలిమినేట్ అవుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించి ఉండ‌రు.

Chiranjeevi : చిరంజీవి మొదలుపెట్టిన ఆ మంచి పనికి 25 ఏళ్ళు.. మెగా బాస్ ఎమోషనల్ పోస్ట్..

ట్రెండింగ్ వార్తలు