Sharwanand : ఓ చెడ్డ సినిమా తీసి దాన్ని హిట్ అంటే ప్రేక్షకులని మోసం చేయడమే..

తాజాగా శర్వానంద్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలియచేశాడు. ఇటీవల సినిమా ఫ్లాప్ అయినా హిట్ అంటూ కొంతమంది సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు, దానికి మీరేమంటారు అని అడగగా.................

Sharwanand :  శర్వానంద్ హీరోగా, అమల ముఖ్య పాత్రలో ఇటీవల వచ్చిన సినిమా ఒకేఒక జీవితం. టైం ట్రావెల్ కాన్సప్ట్ కి అమ్మ సెంటిమెంట్ ని జోడించి వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులోని ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రోజు రోజుకి సినిమాకి ఆదరణ పెరుగుతూ, కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి. సినిమా మంచి విజయం సాధించడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్స్ నిర్వహిస్తుంది.

తాజాగా శర్వానంద్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలియచేశాడు. ఇటీవల సినిమా ఫ్లాప్ అయినా హిట్ అంటూ కొంతమంది సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు, దానికి మీరేమంటారు అని అడగగా.. ”సినిమా సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌ గురించి నేను చాలా ఓపెన్‌గా మాట్లాడతాను. ఇటీవల ప్రమోషన్స్ లో కూడా నా గత సినిమాలు ఫ్లాప్ అయ్యాయనే చెప్పాను. ఓ చెడ్డ సినిమా తీసి దాన్ని హిట్‌ అని చెప్పుకుంటే ప్రేక్షకులని మోసం చేసినట్లే. ఏ సినిమా ఎలాంటిదో ప్రేక్షకులకు తెలుసు. సినిమా పోయినా ఆ రిజల్ట్ ని నిజాయితీగా ఒప్పుకుంటే భవిష్యత్తులో మనకే మంచి జరుగుతుంది” అని అన్నారు.

Singer Sunitha : నా పర్సనల్ విషయాలు మీకెందుకు.. యాంకర్ పై ఫైర్ అయిన సింగర్ సునీత..

ఇటీవల చాలా మంది సినిమా ఫ్లాప్ అయినా హిట్ అంటూ పోస్టర్స్ రిలీజ్ చేయడం, సెలబ్రేషన్స్ చేసుకొని ప్రేక్షకులని మభ్య పెట్టడం చేస్తున్నారు. మరి శర్వానంద్ చెప్పిన ఈ మాటలు విన్న తర్వాత అయినా అలాంటివి ఆపేస్తారేమో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు