Month Of Madhu : ‘మంత్ అఫ్ మధు’ మూవీ రివ్యూ.. రెండు కథలు.. బోలెడన్ని ఎమోషన్స్.. కానీ..

కలర్స్ స్వాతి(Swathi Reddy) చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ‘మంత్ అఫ్ మధు’ (Month of Madhu).

Month Of Madhu Review : కలర్స్ స్వాతి(Swathi Reddy) చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ‘మంత్ అఫ్ మధు’ (Month of Madhu). నవీన్ చంద్ర(Naveen Chandra), శ్రేయ నవిలే, జ్ఞానేశ్వరి, మంజుల, వైవా హర్ష ముఖ్య పాత్రల్లో ఈ సినిమా శ్రీకాంత్ నగోతి దర్శకత్వంలో తెరకెక్కింది. మంత్ అఫ్ మధు సినిమా నేడు అక్టోబర్ 6న రిలీజ్ అయింది.

కథ విషయానికి వస్తే కాలేజీ లెవల్లో ప్రేమించి ఒప్పించి పెళ్లి చేసుకుంటారు స్వాతి, నవీన్ చంద్ర. కొన్నాళ్ల తర్వాత స్వాతి విడాకులకు అప్లై చేయగా నవీన్ చంద్ర మాత్రం తనే ఇంకా కావాలనుకొని తాగుడికి బానిస అవుతాడు. మరో కథలో అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన ఒక టీనేజీ అమ్మాయి ప్రేమ అని ఒక అబ్బాయితో తిరుగుతుంది. స్వాతి, నవీన్ విడాకుల సంగతి ఏమైంది? ఆ అమెరికా టీనేజీ అమ్మాయి ప్రేమ ఏమైంది అని రెండు కథలని తెరపై చూడాల్సిందే.

సినిమా అంతా సాగతీత లాగానే ఉంటుంది. హీరో సినిమా అంతా తాగుతూనే ఉంటాడు. హీరోయిన్ సినిమా అంతా ఏడుపు ముఖంతోనే ఉంటుంది. అసలు వాళ్ళు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారో క్లారిటీ ఇవ్వలేదు. సినిమాకు ఎండింగ్ కూడా సరిగ్గా ఇవ్వలేదు. ఇలాంటి పాయింట్స్ చాలా సినిమాలు ఉన్నాయి. కానీ ఒకటే పాయింట్ ని సినిమా అంతా సాగతీసినట్టు అనిపిస్తుంది.

Also Read : MAD Movie Review : ‘మ్యాడ్’ సినిమా రివ్యూ.. రెండు గంటల పాటు కడుపు చెక్కలయ్యేలా నవ్వుకోవచ్చు..

స్వాతి చాలా గ్యాప్ తీసుకొని ఇలాంటి క్యారెక్టర్ తో ఎందుకు రీ ఎంట్రీ ఇచ్చిందో తనకే తెలియాలి. మంచి యాక్టింగ్ చేయగల నవీన్ చంద్ర ఎలాంటి యాక్టింగ్ స్కోప్ లేని ఈ పాత్ర ఎందుకు ఎంచుకున్నాడో. ఒక్క శ్రేయ అనే కొత్త అమ్మాయి మాత్రం తన పాత్రలో మెప్పించింది. స్క్రీన్ ప్లే కూడా రెండు కథల మధ్య తిరుగుతూనే హీరో – హీరోయిన్స్ ప్రస్తుత, గతానికి తిరుగుతూ ఉంటుంది. గతంలో ఇదే డైరెక్టర్ భానుమతి రామకృష్ణ అనే మంచి ఎమోషనల్ కామెడీ కంటెంట్ ఉన్న సినిమాని తీసి మెప్పించాడు. కానీ ఈ సినిమాలో మాత్రం ఫెయిల్ అయినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాకు 2 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ రివ్యూ, రేటింగ్ కేవలం విశ్లేషకుడి అభిప్రాయం మాత్రమే..

ట్రెండింగ్ వార్తలు