RGV – Nag Ashwin : ఆర్జీవిని నాగ్ అశ్విన్ అంత మాట అనేశాడేంటి..? కల్కిలో ఆర్జీవీ గెస్ట్ అప్పీరెన్స్‌పై ఏమన్నాడంటే..

తాజాగా నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించగా ఓ మీడియా ప్రతినిధి ఆర్జీవీ గారిని గెస్ట్ అప్పీరెన్స్ కి ఎలా ఒప్పించారు అని అడిగారు.

Kalki Director Nag Ashwin Interesting comments on RGV about his guest Appearance in Movie

RGV – Nag Ashwin : ప్రభాస్ కల్కి సినిమా భారీ హిట్ అయి ఇప్పటికే 700 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది. కల్కి సినిమా ప్రేక్షకులందరికీ నచ్చేసింది. అయితే ఈ సినిమాలో చాలా మంది గెస్ట్ అప్పీరెన్స్ లు, స్పెషల్ రోల్స్ చేసారు. కల్కి సినిమాలో ప్రభాస్, దీపికా పదుకోన్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, శోభన మెయిన్ లీడ్స్ చేయగా రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, అన్నా బెన్, దిశా పటాని, బ్రహ్మానందం, డైరెక్టర్ ఆర్జీవీ, డైరెక్టర్ రాజమౌళి, డైరెక్టర్ అనుదీప్, విజయ్ దేవరకొండ, ఫరియా అబ్దుల్లా, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల.. ఇలా చాలా మంది నటీనటులు గెస్ట్ అప్పీరెన్స్, స్పెషల్ రోల్స్ చేసారు.

అయితే నటీనటులు గెస్ట్ రోల్స్ చేయడం కామన్. డైరెక్టర్స్ చాలా అరుదుగా గెస్ట్ రోల్స్ చేస్తారు. అలాంటిది కల్కి సినిమాలో టాప్ డైరెక్టర్స్ రాజమౌళి, ఆర్జీవీ ఇద్దర్ని ఒప్పించి గెస్ట్ రోల్స్ చేయించాడు అంటే నాగ్ అశ్విన్ గ్రేట్ అని చెప్పొచ్చు. ఆర్జీవీ తెరపై కనపడినప్పుడు థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. ఆర్జీవీ ఫ్యాన్స్ కూడా ఈ గెస్ట్ పాత్రపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్జీవీని నాగ్ అశ్విన్ ఎలా ఒప్పించాడు అని అంతా అనుకున్నారు.

Also Read : Ashwini Dutt : పవన్ కళ్యాణ్ గురించి నేను అలా అనలేదు.. క్లారిటీ ఇచ్చిన కల్కి నిర్మాత..

తాజాగా నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించగా ఓ మీడియా ప్రతినిధి ఆర్జీవీ గారిని గెస్ట్ అప్పీరెన్స్ కి ఎలా ఒప్పించారు అని అడిగారు. దీనికి నాగ్ అశ్విన్ సమాధానమిస్తూ.. మన తెలుగు సినిమా స్థాయిని మార్చింది ఆర్జీవీ, రాజమౌళి. వారిద్దరూ నాకు ఇష్టం. వారిద్దరికీ ఒక ట్రిబ్యూట్ లాగా ఇవ్వాలని అనిపించి వాళ్ళని గెస్ట్ అప్పీరెన్స్ ని అడిగాను. ఆర్జీవీ గారిని అడిగితే నేనెప్పుడూ నటించలేదు, నేను ఎందుకు అన్నారు. కలియుగం చివర్లో మీ లాంటి మనుషులే ఉంటారు అందుకే మీరు చిన్న రోల్ చేస్తే బాగుంటుంది అని అడిగాను. దీంతో వెంటనే ఆయన ఒప్పుకొని షూటింగ్ ఎప్పుడో చెప్పు వచ్చేస్తాను అన్నారు అని తెలిపారు.

దీంతో నాగ్ అశ్విన్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆర్జీవీ అందరికి డిఫరెంట్ గా ఆలోచిస్తూ, అందరికి డిఫరెంట్ గా బతుకుతుంటాడు. ఇలాంటి మనిషి చాలా అరుదు అని అందరూ అనుకుంటారు. నాగ్ అశ్విన్ కలియుగం చివరలో మీ లాంటి మనుషులే ఉంటారు అని ఆర్జీవికి చెప్పడం, ఆర్జీవీ ఆ మాటకి ఓకే చెప్పడంతో అందరూ కరెక్ట్ గానే చెప్పారు అని అనుకుంటున్నారు. ఆర్జీవీ కూడా సినిమా రిలీజ్ తర్వాత ఇలాంటి గొప్ప సినిమాలో నాకు పాత్ర ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేసాడు.