Prabhas shows Past Present and Future with in One Year Gap with his Movies Adipurush Salaar and Kalki 2898AD
Prabhas : ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. బాహుబలి నుంచి అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఇండియా వైడ్ ప్రేక్షకులని మెప్పిస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. స్టార్ హీరోలంతా కమర్షియల్ సినిమాలు చేస్తుంటే ప్రభాస్ కమర్షియల్ అంశాలు పెడుతూనే ప్రయోగాలు చేస్తున్నాడు.
బాహుబలిలో పీరియాడిక్ స్టోరీ చూపించారు. సాహోలో స్టైలిష్ యాక్షన్ చూయించారు. రాధేశ్యామ్ లో పీరియాడిక్ లవ్ స్టార్ చూపించారు. ఆదిపురుష్ లో త్రేతాయుగం నాటి రాముడి కథ చూపించారు. సలార్ లో యాక్షన్స్ చూపించారు. ఇప్పుడు కల్కిలో భవిష్యత్తు ఎలా ఉంటుందో చూపించారు. ఇలా సినిమా సినిమాకి సరికొత్తగా వస్తున్నాడు ప్రభాస్.
అయితే సంవత్సరం గ్యాప్ లో ప్రభాస్ భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్ని చూపించేసాడని అంటున్నారు అభిమానులు, నెటిజన్లు. 2023 జూన్ లో ఆదిపురుష్ రిలీజయింది. ఇది పాస్ట్ లో జరిగిన రామాయణం కథ. ఆ తర్వాత 2023 డిసెంబర్ లో ప్రస్తుతం జరిగే కథతో సలార్ చూపించారు. ఇప్పుడు 2024 జూన్ లో కలియుగం చివర్లో ఎలా ఉంటుంది అని భవిష్యత్తు చూపించారు.
Also Read : RRR రికార్డ్ లేపేసిన కల్కి.. అమెరికాలో ప్రభాస్ సరికొత్త రికార్డ్.. ఏ హీరోకి లేదుగా..
ఇలా సంవత్సరం గ్యాప్ లో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ చూపించేసాడు ప్రభాస్. ఇలా ఒక్క సంవత్సరం గ్యాప్ లో మూడు డిఫరెంట్ కథల్ని తీసుకురావడం ప్రభాస్ కే సాధ్యం అని అంటున్నారు. ప్రస్తుతానికి ప్రభాస్ వరుస సినిమాలతో, రాబోయే సినిమాలతో ఫుల్ ట్రెండ్ లో ఉన్నాడు. పాన్ ఇండియా వైడ్ ప్రభాస్ హవా నడుస్తుంది. స్టార్ హీరో అయి ఉండి పూర్తి కమర్షియల్ సినిమాలు చేయకుండా ఇలా ప్రయోగాలతో కమర్షియల్ గా సినిమాలు చేయడం ప్రభాస్ కే చెల్లింది.